'ఉరుకుల పరుగుల జీవితం. తీరికలేని పని. ఇందులో వ్యాయామానికి సమయం ఎక్కడిది'. ఇది ప్రస్తుతం కొందరి యువత మాట. కానీ సమయంతో పోటీ పడుతూ సాగే జీవనశైలిలోనూ తమ డైట్, వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు పలువురు సినీ కథానాయికలు. మరి వారు పాటించే డైట్, ఫిట్‌నెస్ చిట్కాలు ఓ సారి తెలుసుకుందాం. వీలైతే పాటించేద్దాం.
దీపికా పదుకొణె
అలాగే చూస్తుండిపోవాలనిపించే అందం దీపికా సొంతం. తన అథ్లెటిక్ శరీరం కారణంగా ఏ వేషధారణలోనైనా అందంగా, ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు అనేక కసరత్తులు చేస్తుంది దీపిక. కఠినమైన డైట్ ప్లాన్, రోజువారీ వర్కవుట్‌ల కారణంగానే తన కెరీర్ మొత్తంలో సన్నని, ఫిట్ శరీరాన్ని కొనసాగిస్తోంది.
- డైట్: ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగుతుంది. దక్షిణ భారత వంటలంటే ఇష్టం. అల్పాహారంలో వాటికే ప్రాధాన్యం ఇస్తుంది. దాంతోపాటు రెండు గుడ్లను తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనానికి కాల్చిన చేప, రెండు చపాతీలు, బ్రౌన్ రైస్, కూరగాయలు తీసుకుంటుంది. సాయంత్రం కాఫీతోపాటు, పండ్లు, గింజలను ఎంచుకుంటుంది. ఇక రాత్రి కూరగాయలతో పాటు రెండు చపాతీలు, సలాడ్లు తీసుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, యోగాతో తన రోజు మొదలెడుతుంది. తదుపరి ఓ అరగంట నడకకు కేటాయిస్తుంది. ఇక క్రంచెస్, పుష్-అప్స్, లైట్ వెయిట్ ట్రైనింగ్ తదితర వ్యాయామాలు తన సెషన్‌లో భాగమంటుంది.
శిల్పా శెట్టి
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తుంది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. తన పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వ్యాయామమే. అంతలా దాన్ని తన జీవితంలో భాగం చేసుకుంటూ రోజురోజుకీ మరింత ఫిట్‌గా తయారవుతోంది. అమ్మ అయిన తర్వాత అనవసరపు కొవ్వును పోగొట్టుకునేందుకు మరింత కసరత్తులు చేస్తోంది. యోగా, ప్రాణాయామం తదితర తన ఫిట్‌నెస్ రహస్యాలను తెలుపుతూ సీడీలనూ విడుదల చేసింది.
- డైట్: శిల్పా తన రోజుని అలొవెరా జ్యూస్‌తో మొదలెడుతుంది. అల్పాహారంలో ఓట్స్, పాలు, రెండు గుడ్లు, పండ్లను ఎంచుకుంటుంది. డైట్‌లో భాగంగా కార్బోహైడ్రేట్‌లు తక్కువగా తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్‌రైస్ లేదా రెండు చపాతీలు పప్పు, కూరగాయలు, చికెన్ లేదా కాల్చిన చేపను ఎంచుకుంటుంది. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యతనిస్తుంది. రాత్రి వెజిటేబుల్ సూప్ తీసుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: తన వారాన్ని వర్కవుట్‌ల కోసం సమర్థవంతంగా వినియోగించుకుంటుంది శిల్ప. రెండు రోజులు యోగా, ఓ రోజు కార్డియో వర్కవుట్, మరో రెండు రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్‌కు వినియోగించుకుంటుంది.
ప్రియాంకా చోప్రా
ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంకా చోప్రా. తనో ఫిట్‌నెస్ ఫ్రీక్. క్రమశిక్షణ పట్టుదలతోనే ప్రపంచ సుందరిగా మెరిసింది. నాటి నుంచి నేటి వరకు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది ప్రియాంక.
- డైట్: ప్రియాంక ఓ ప్రత్యేక డైట్‌ను పాటించదు. తన మనసుకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకుంటుంది. కానీ వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. చిరుతిళ్లంటే తనకు చాలా ఇష్టం. ఇక ఎక్కువగా అల్పాహారంలో రెండు గుడ్లు, ఓ గ్లాసు పాలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజన సమయంలో రెండు చపాతీలు, కూరగాయలు, పప్పు, సలాడ్ తదితర ఆహారానికి ప్రాధాన్యమిస్తుంది. రాత్రి భోజనంలో చికెన్ లేదా కాల్చిన చేపలు, సూప్ తీసుకునేందుకు ఇష్టపడుతుంది.
- జిమ్ వర్కవుట్: తన రోజువారీ వర్కవుట్ సెషన్‌లో జిమ్, యోగా, కార్డియో వ్యాయామాలు, ఒత్తిడిని నివారించే వర్కవుట్‌లు తదితర వాటికి ప్రాధాన్యమిస్తుంది.
అలియా భట్
తన నటనతోనే కాదు ఆకట్టుకునే అందంతో కుర్రకారు మదిని దోచి తనవైపు తిప్పేసుకుంది అలియా. నటనతో పాటు మంచి ఫిట్‌నెస్ అలియాను బాలీవుడ్ నాయికల్లో ముందు వరుసలో ఉంచింది. ఎప్పుడూ హుషారుగా, ఆనందంగా ఉండే ఆలియా తన విజయానికి ఫిట్‌నెస్, డైటే తోడ్పడిందంటుంది.
- డైట్: అల్పాహారంలో గుడ్లు, టీ లేదా కాఫీ, కార్న్‌ఫ్లేక్స్‌ని ఎంచుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో కూరగాయలతో కూడిన చపాతీలను తీసుకుంటుంది. సాయంత్రపు సమయంలో పండ్లను తింటుంది. ఇక రాత్రి భోజన సమయంలో చపాతి, కూరగాయలు, చికెన్‌ను ఎంపిక చేసుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: కార్డియో, యోగా, వెయిట్ ట్రైనింగ్‌తో పాటు డ్యాన్స్ తన వర్కవుట్ సెషన్‌లో భాగమంటుంది ఆలియా.
పరిణీతి చోప్రా
కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తదనంతర కాలంలో ఫిట్‌గా, సన్నగా తయారైంది. అందుకు ఎంతో కష్టపడింది. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయింది.
- డైట్: ఉదయాన్నే ఓ కప్పు వేడినీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగుతుంది. ఇక అల్పాహారం విషయానికొస్తే ఒక బ్రౌన్ బ్రెడ్‌తో పాటు రెండు ఉడికించిన గుడ్లు, గాస్లు పాలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్‌రైస్, చపాతి, పప్పు, కూరగాయలు ఎంపిక చేసుకుంటుంది. రాత్రి కూరగాయలు, తక్కువ కొవ్వుతో కూడిన ఆహారం, పాలను తీసుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: క్రంచెస్, పుష్‌అప్స్ తదితర వ్యాయామాలతో రోజుని మొదలెడుతుంది పరిణితీ. పరుగు తన వ్యాయామాల్లో భాగమంటుంది. ఈత, యోగతోపాటు గుర్రపు స్వారీని ప్రయత్నిస్తుంది.
ఐశ్వర్యారాయ్
ఆకట్టుకునే అందం ఐశ్వర్య సొంతం. కెరీర్ మొదట్లో సన్నగా, నాజూకుగా కనిపించే ఐశ్వర్య అమ్మ అయిన తర్వాత బరువు పెరిగింది. వ్యాయామం గురించి పెద్దగా ఆలోచించని ఐష్ ఎక్కువగా యోగా సెషన్లనే ఇష్టపడుతుంది.
- డైట్: ఉదయం గోరువెచ్చని నీటితో నిమ్మరసం, తేనె తీసుకుంటుంది. అల్పాహారంలో ఓట్ మీల్‌ను ఎంచుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో చపాతీ, పప్పు, కూరగాయలను తీసుకుంటుంది. రాత్రి బ్రౌన్ రైస్, కాల్చిన చేపను ఎంచుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: ఫిట్‌గా ఉండేందుకు యోగా ఉత్తమమైన మార్గమని ఐశ్వర్య నమ్ముతుంది. ఉదయం నడకతో తన రోజుని మొదలెట్టి తర్వాత 45నిమిషాల పాటు యోగా సెషన్‌లో ఉంటుంది. వారానికి రెండు సార్లు జిమ్‌కి వెళుతుంది. ఇంట్లో కార్డియో వ్యాయామాలు చేస్తుంది.
కరీనాకపూర్
రోజువారీ వ్యాయామం, ఆహారనియమాలు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ.. ఇవే కరీనాను సినీరంగంలో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకునేలా చేశాయి. జంక్‌ఫుడ్ జోలికి అసలే పోని కరీనా తన డైట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
- డైట్: అల్పాహార సమయంలో సోయా పాలతో పాటు బ్రెడ్, అరటిపండ్లను ఎంచుకుంటుంది. మధ్యాహ్న భోజన సమయంలో చపాతీలు, పప్పు, పెరుగన్నం, సాలాడ్‌ని తీసుకుంటుంది. రాత్రి భోజనంలో పుదీనా పాలక్ రోటీ, పప్పు, వెజిటేబుల్ సూప్‌ని ఎంచుకుంటుంది. ప్రతిరోజు 6-8గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగుతుంది. సాయంత్రపు సమయాల్లో ప్రొటీన్ షేక్, పండ్లును తప్పక తీసుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: యోగాను ఎక్కువగా ఇష్టపడుతుంది కరీనా. ఉదయం యోగాతో తన రోజుని మొదలెడుతుంది. ఓ అరగంట పరుగుకు కేటాయిస్తుంది. ఈత తన వ్యాయామంలో భాగం. కోర్ వ్యాయామాలను ఎంచుకుంటుంది. వారంలో ఆరురోజులు తప్పక జిమ్‌కు సమయం కేటాయిస్తుంది.
సుస్మితా సేన్
మెరిసే కళ్లు, చూడచక్కనైన రూపం, మిలియన్ డాలర్ చిరునవ్వు సుస్మిత సొంతం. వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా తయారవుతోంది ఈ అందాల రాణి. అందుకు తన డైట్, ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. తనకంటూ ప్రత్యేక డైట్‌ను ఫాలో అవుతుంది.
- డైట్: తన రోజుని కప్పు అల్లం టీతో మొదలెడుతుంది సుస్మిత. తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను అల్పాహారంగా తీసుకుంటుంది. మూడు గుడ్లతో పాటు ఓ గ్లాసు వెజిటేబుల్ జ్యూస్‌ను ఎంచుకుంటుంది. మధ్యాహ్నం అన్నం, పప్పు, కూరగాయలు, చికెన్ లేదా చేపలను తీసుకుంటుంది. సాయంత్రపు సమయంలో వెజిటేబుల్ - సాండ్‌విచ్ లేదా ఇడ్లీ లేదా ఓ కప్పు ఉప్మాతోపాటు కాఫీని ఎంచుకుంటుంది.
- జిమ్ వర్కవుట్: కోర్ స్ట్రెంతింగ్ వర్కవుట్స్‌తో పాటు బాక్సింగ్, డ్యాన్స్, ఈత తన వర్కవుట్స్‌లో భాగమంటుంది సుస్మిత.
ఇదీ చూడండి: పిల్లి కళ్లతో పిచ్చెక్కిస్తోన్న 'కరెంట్' భామ