బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం యువ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఈ అనన్య.. తను ఎందుకు సింగిల్‌గా ఉందో చెప్పింది.
ఆ దర్శకుడి వల్లే..
అనన్య తొలిసారి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ చిత్రానికి పునీత్ మల్హోత్రా దర్శకుడు. అతడి వల్లే తనను ఎవరూ లవ్ చేసేందుకు ముందుకురావట్లేదని చెప్పుకొచ్చింది. తను చాలా రక్షణగా ఉంటాడని తెలిపింది. అయితే ఇదంతా ప్రచారం కోసం చెప్పినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ అమ్మడు కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతడు మాత్రం ప్రస్తుతం సారా అలీఖాన్‌తో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నాడు.