బాలీవుడ్లో వివిధ రకాల జోనర్లలో సినిమాలు రూపొందాయి. హీరోలు కూడా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. అందులో దొంగతనం నేపథ్యంలోనూ పలు చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, హృతిన్ రోషన్ లాంటి హీరోలు దొంగలుగా నటించి అలరించారు. అలా హిందీ సినీ పరిశ్రమలో దొంగగా నటించి మెప్పించిన హీరోలపై ఓ లుక్కేద్దాం.
రాయ్ (2015)
ఈ సినిమాకు విక్రమ్‌జిత్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాయ్ అనే దొంగ పాత్రలో నటించాడు రణ్‌బీర్ కపూర్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషించారు. రాంపాల్ ఓ ఫిల్మ్ మేకర్‌గా కనిపించగా.. అతడి సినిమాలో దొంగ పాత్రలో కనిపిస్తాడు రణ్‌బీర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బంధీ హాత్ (1973)
1973లో తెరకెక్కిన 'బంధీహాత్' చిత్రంలో అమితాబ్ బచ్చన్, ముంతాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇందులో అమితాబ్ శ్యామూ అనే అనాథగా పెరిగి దొంగగా మారతాడు. ఈ సినిమాలో బిగ్‌బీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ధూమ్ (2004)
బాలీవుడ్లో 'ధూమ్' ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇందులో మొదటి భాగంలో జాన్ అబ్రహం దొంగగా నటించగా అభిషేక్ బచ్చన్ పోలీసు అధికారిగా కనిపించాడు. వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకుంటున్న గ్యాంగ్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారన్నదే కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ధూమ్ 2 (2006)
'ధూమ్' ఫ్రాంచైజీలో వచ్చిన రెండో భాగంలో హృతిక్ రోషన్ దొంగగా అలరించాడు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఉదయ్ చోప్రా కీలకపాత్రల్లో కనిపించారు. 'ఏ' (A-హృతిక్ రోషన్ ) అనే దొంగ చేస్తున్న చోరీలను పోలీసులు ఎలా ఛేదించారనేదే స్టోరీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ధూమ్ 3 (2013)
ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ దొంగ పాత్రలో నటించి మెప్పించాడు. ఇందులో అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా ప్రధానపాత్రల్లో నటించారు. సర్కస్, ఆక్రోబాట్స్లో నిష్ణాతుడైన సాహిర్ (ఆమిర్ ఖాన్) చేసే చోరీలను ఛేదించడానికి అభిషేక్ బచ్చన్ ఎలా ప్లాన్ చేశాడన్నది స్టోరీ. ఇందులో ఆమిర్ ద్విపాత్రాభినయం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">