ETV Bharat / sitara

సినిమాల్లో నటుడు.. ప్రజలకు ఆపద్బాంధవుడు

కొన్నిరోజుల క్రితం వరకు అతి సాధారణంగా కనిపించిన నటుడు సోనూసూద్.. ప్రస్తుతం చాలామందికి ఆపద్బాంధవుడిగా మారాడు. నేడు అతడు 47వ పుట్టిరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోనూసూద్ గురించి ప్రత్యేక కథనం.

bollywood actor sonusood birthday special
బాలీవుడ్ నటుడు సోనూసూద్
author img

By

Published : Jul 30, 2020, 5:41 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఓ రైతు.. ఎద్దుల్లేక తన కుమార్తెలతో ఇటీవలే కాడి మోయించాడు. దానిని వీడియో తీసిన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎక్కడో ముంబయిలో ఉన్న ఓ సాధారణ నటుడు అది చూసి.. మీకు నేనున్నాను, తర్వాతి రోజు ఉదయానికల్లా ఎద్దుల జత అందేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చాడు. ఎద్దులైతే మళ్లీ ఇబ్బంది రావొచ్చేమోనని, ఏకంగా ట్రాక్టర్​నే వాళ్ల ఇంటికి పంపించాడు. ఇలా వీళ్ల ఒక్క కుటుంబానికే కాదు.. లాక్​డౌన్​ ప్రభావంతో వలసకూలీల నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల వరకు చాలామందికి తన సొంత ఖర్చులతో చేతనైనా సాయం చేశాడు. ఏం భయపడొద్దు, తానున్నానంటూ భరోసా కల్పించాడు. భవిష్యత్తులోనూ ఎంతోమందికి ఇలానే సేవచేస్తానని చిరునవ్వుతో చెబుతున్నాడు. అతడే ప్రజలందరూ మెచ్చిన సోనూసూద్. ఈరోజు(జులై 30) 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

actor sonusood birthday
బాలీవుడ్ నటుడు సోనూసూద్

ఇది చదవండి: సోనూసూద్ ఇంటర్వ్యూ: 'రాజకీయ ప్రయోజనాల కోసం చేయట్లేదు'

రీల్​లైఫ్​లో సోనూసూద్ విలన్. తెరపై అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. విలనిజం అంటే ఇలానే ఉండాలి అనే మార్క్​ను సృష్టించాడు. నిజజీవితంలో మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటూ అందరికీ సాయం చేస్తున్నాడు. ఒకప్పుడు సోనూ అంటే పేరు మాత్రమే. ఇప్పుడు మాత్రం వలసకూలీల పాలిట దైవంగా మారాడు.

actor sonusood birthday
బాలీవుడ్ నటుడు సోనూసూద్

లాక్​డౌన్​లో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల ఇబ్బందులు తెలుసుకున్న సోనూసూద్.. తన సొంత ఖర్చుతో వీలైనంత మందిని వారి స్వస్థలాలకు చేర్చాడు. ముంబయి కార్పొరేషన్​తో కలిసి, పేదలకు ప్రతిరోజూ ఉచితంగా భోజనమూ అందించాడు. ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకున్న సోనూసూద్.. కూలీలతో తన అనుభవాలు పుస్తక రూపమివ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఇది చదవండి: సోనూసూద్ ప్రత్యేక ఇంటర్వ్యూ: అలా చేయడం నా బాధ్యత

లాక్​డౌన్​ సమయంలో మరణించిన, గాయపడిన వలసకూలీల కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు సోనూసూద్. ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి 400 కుటుంబాల జాబితా తెప్పించి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.

దీనితోపాటే లాక్​డౌన్​ వల్ల ఉఫాది కోల్పోయిన వలస కార్మికుల సంక్షేమం కోసం 'ప్రవాసీ రోజ్​గార్' పేరుతో ఓ యాప్​ను తీసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పనలో భాగంగా ఓ ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్​ను రూపొందించాడు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి.

actor sonusood birthday
నటుడు సోనూసూద్

సినిమాల్లో ప్రతినాయకుడిగా ఎన్ని సినిమాలు చేసినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం సోనూసూద్‌ను పశుపతిగానే గుర్తుంచుకుంటారు. 'అరుంధతి'లో బొమ్మాళీ నిన్నొదలా అంటూ ఇతడు చేసిన హంగామా అలాంటిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు సోనూ. 'సిటీ ఆఫ్‌ లైప్‌', 'కుంగ్‌ఫు యోగా'తో ఆంగ్లంలోనూ మెప్పించాడు. నటుడిగానే కాకుండా, మోడల్‌గా, నిర్మాతగా కూడా రాణించాడు.

ఇది చదవండి: 400 పేద కుటుంబాలకు అండగా సోనూసూద్

1999లో 'కలైజ్ఞర్‌', 'నెంజిలే' చిత్రాలతో తమిళంలోకి అడుగుపెట్టాడు సోనూ. ఆ తర్వాత తెలుగులో 'హ్యాండ్సప్‌'లో చేశాడు. 2005లో నాగార్జున 'సూపర్‌'తో సోనూకు తెలుగులో మంచి గుర్తింపొచ్చింది. అనంతరం 'అతడు', 'అశోక్‌', 'అరుంధతి', 'ఆంజనేయులు', 'ఏక్‌ నిరంజన్‌', 'కందిరీగ', 'దూకుడు' సినిమాలతో మెప్పించాడు.

2016లో తన తండ్రి శక్తిసాగర్‌ పేరుతో శక్తిసాగర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను ప్రారంభించారు సోనూ. 'అభినేత్రి' హిందీ వెర్షన్‌ 'తూటక్‌ తూటక్‌ తూటియా'కు నిర్మాతగా వ్యవహరించారు. అంతర్జాతీయ నటుడు జాకీచాన్‌తో కలిసి తాను నటించిన 'కుంగ్‌ఫు యోగా'ను హిందీలో సొంతంగా విడుదల చేశారు.

sonusood sketch
ఓ చిత్రకారుడు గీసిన సోనూసూద్ చిత్రం

'అరుంధతి'లో నటనకుగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా తెలుగులో నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగులో చివరగా 'సీత'లో ప్రతినాయకుడిగా కనిపించారు.

ప్రస్తుతం ఎంతోమంది సహాయం చేస్తూ మంచిమనసు చాటుకున్న సోనూసూద్.. ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆశిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.