ETV Bharat / sitara

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి హైకోర్టులో చుక్కెదురు

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అశ్లీల చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్తపై వార్తా ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్​మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోవాలని శిల్పాశెట్టి కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. అలాంటి కథనాలు రాకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది.

Blanket gag order will have chilling effect on press freedom: HC on Shilpa plea
బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి హైకోర్టులో చుక్కెదురు
author img

By

Published : Jul 30, 2021, 10:15 PM IST

పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్​కుంద్రా పరువుకు భంగం వాటిల్లే విధంగా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలు మీడియా సంస్థలతో పాటు ట్విట్టర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ వంటి మాధ్యమాల్లో తమ గురించి తప్పుగా రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పిటిషన్​ శుక్రవారం విచారణకు రాగా.. "భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు" అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్​ గౌతమ్​ పటేల్​ ఈ విధంగా తెలిపారు.

"పోలీసులు చెప్పిన వివరాలను ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతిదాన్నీ అడ్డుకోవాలంటే పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపినట్లవుతుంది. భార్యాభర్తల మధ్య సంభాషణ పోలీసుల ముందే జరిగింది. అలా క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మీడియా రిపోర్టులు వచ్చాయి. పిటిషన్​దారు పబ్లిక్​ లైఫ్​ను ఎంచుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీల జీవితాన్ని ప్రజలు ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో తన భర్తతో ఎందుకు వాదన పెట్టుకున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా మేము వ్యవహరించలేం. అయితే పిటిషనర్​ పిల్లల పెంపకం గురించి మీడియాలో కథనాలు రావడం మాత్రం అభ్యంతరకరమైనదే".

- జస్టిస్​ గౌతమ్​ పటేల్, హైకోర్టు న్యాయమూర్తి

రాజ్‌కుంద్రా ఈనెల 19న అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండగా.. ఇటీవలే కొందరు బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమగోడు వెల్లబోసుకుంటున్నారు. రాజ్‌కుంద్రా తమను ఎలా వంచించాడో పోలీసులకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. కుంద్రా కొందరిపై లైంగికదాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉండి అవకాశాలు లేనివారికి డబ్బు ఆశ చూపిన రాజ్‌కుంద్రా.. మరికొందరికి బాలీవుడ్‌లో అవకాశాలను ఎరగా వేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. 'శిల్పాశెట్టి దూరం పెట్టడం వల్లే రాజ్​ కుంద్రా అలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.