అమెరికాకు చెందిన 'బ్లాక్ ఐడ్ పీస్' మ్యూజిక్ గ్రూప్ భారతీయ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలతో సరికొత్త మ్యూజిక్ వీడియోను రూపొందించింది. 'మర్యాద రామన్న', 'రోబో', 'అంబాలా', 'కోప్స్', 'సింగం' వంటి చిత్రాల్లోని పలు యాక్షన్ సన్నివేశాలను ఎడిట్ చేసి దీనిని తయారు చేశారు. బ్యాండ్‌లోని ప్రధాన గాయకుడు విల్.ఐ.ఎమ్ ఈ పాటను ఆలపించాడు. 'యాక్షన్' అనే పేరుతో విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రూపొందించేందుకు వారు డీప్ ఫేక్ టెక్నాలజీను ఉపయోగించినట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు విపరీతంగా లైక్‌లు కొడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీడియోను బ్లాక్ ఐడ్ పీస్ యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేస్తూ.. భారతీయ చిత్రాలు తమకు ఎంతో ప్రేరణ ఇచ్చాయని పేర్కొన్నారు. "భారతీయ సంస్కృతి నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఆశా భోంస్లే నుంచి ఏఆర్ రెహ్మన్ వరకు ఇండియన్ మ్యూజిక్ చాలా సార్లు మా పాటలను ప్రభావితం చేసింది. భారత్‌పై మా ప్రేమను తెలియజేసేందుకే ఈ వీడియోను రూపొందించాం" అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై రెహ్మన్ స్పందిస్తూ.. కళకు సరిహద్దులు అడ్డే కాదని అన్నారు.
-
The borders are blurring through art!#tamilcinema @directorshankar #rajnikant #india https://t.co/kbED926VqH
— A.R.Rahman (@arrahman) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The borders are blurring through art!#tamilcinema @directorshankar #rajnikant #india https://t.co/kbED926VqH
— A.R.Rahman (@arrahman) August 9, 2020The borders are blurring through art!#tamilcinema @directorshankar #rajnikant #india https://t.co/kbED926VqH
— A.R.Rahman (@arrahman) August 9, 2020