బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, నటి సన్నీలియోని తన తల్లితండ్రులని చెప్తున్నాడు బిహార్‌కు చెందిన ఓ 20 ఏళ్ల కుర్రాడు. అతడు.. ముజఫర్‌పుర్‌లోని మీనాపుర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ఓ కళాశాలలో చదువుతున్నాడు.
వైరల్ అయిన అడ్మిట్ కార్డ్..
ధన్‌రాజ్ మహతో డిగ్రీ కళాశాలకు చెందిన కుందన్ కుమార్.. బాలీవుడ్ నటీనటులను తల్లితండ్రులుగా పేర్కొంటూ వివరాలు సమర్పించాడు. నాన్న పేరు ఇమ్రాన్ హష్మీ, తల్లి పేరు సన్నీలియోని అని ఉన్న ఈ అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అయింది.
మరో హాస్యాస్పద విషయం ఏంటంటే.. తన ఇంటి అడ్రస్ 'చతుర్భుజ్ స్థాన్' అని పేర్కొన్నాడు. ఇది ముజఫర్‌పుర్‌లో వ్యభిచార గృహాలు ఎక్కువగా ఉండే ప్రాంతం.
"దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. సంబంధిత విద్యార్థి కావాలనే ఇలా చేసి ఉండొచ్చు. అడ్మిట్ కార్డుపై ఉన్న మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్ ద్వారా సంబంధిత విద్యార్థి వివరాలు తెలుసుకుంటాం. దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం".
-ఎగ్జామ్ కంట్రోలర్, బీం రావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం.
ఈ విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఈటీవీ-భారత్‌కు తెలిపారు విశ్వవిద్యాలయ ఎగ్జామ్ కంట్రోలర్.
ఇదీ చదవండి:అమ్మో.. అంత పెద్ద సినిమాలు తీశారా?