బయోపిక్‌లు... ప్రస్తుతం సినీ పరిశ్రమలో ట్రెండింగ్. ప్రముఖ వ్యక్తుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాల విజయాల శాతం ఎక్కువ. వాణిజ్యపరంగానూ లాభాలొస్తున్నాయి. కొన్ని చిత్రాలు కొంతమందిని ప్రజలకు తెలిసేట్లు చేస్తే.. మరికొన్ని ప్రముఖుల గొప్పతనాన్ని గుర్తుచేశాయి. బయోపిక్‌లతో ప్రాచుర్యం పొందిన కొంతమంది వ్యక్తుల గురించి.. ఆ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం!
మహానటి
సావిత్రి... ఆ తరం వాళ్లకే కాదు నేటి తరానికీ గుర్తుండి పోయే నటి. ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ. 'మహానటి' చిత్రంతో సావిత్రి జీవితంలోని కష్టసుఖాలను చూపించాడు దర్శకుడు. నటి అయిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆమె ఎదుర్కొన్న సంఘర్షణలు కళ్లకు కట్టారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సావిత్రి గొప్పతనం గురించి ప్రతి తెలుగువాడికి తెలిసింది. 2018లో విడుదలైన ఈ చిత్రంలో కీర్తి సురేశ్.. ఆ మహానటి పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవలే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో మూడు అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మాంఝీ-ద మౌంటేన్ మ్యాన్
'మాంఝీ-ద మౌంటేన్ మ్యాన్' సినిమా రాకముందు ఈయన గురించి చాలామందికి తెలియదు. ప్రేమ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కడితే... అదే ప్రేమ కోసం కొండను కూల్చేశాడు మన మాంఝీ. బిహార్‌కి చెందిన ఈయన గ్రామానికి సమీపంలో ఓ కొండ ఉండేది. ఆ గ్రామానికి వెళ్లాలంటే ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. గర్భవతిగా ఉన్న తన భార్య ఓ రోజు కొండ పైనుంచి పడి చనిపోతుంది. తన భార్య చావుకు కారణమైన ఆ పర్వతాన్ని ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లపాటు కష్టపడి.. తొలిచేసి మార్గాన్ని ఏర్పాటు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మౌంటేన్ మ్యాన్ (పర్వత మనిషి)గా పిలుచుకునే మాంఝీ 2007లో మరణించాడు. 2015లో బాలీవుడ్లో వచ్చిన ఈయన బయోపిక్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు.
ప్యాడ్‌మ్యాన్
రుతుస్రావం సమయంలో సానిటరీ న్యాప్కిన్లపై మహిళలకు అవగాహన పెంచి, వాటిని అతితక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు తమిళనాడుకు చెందిన అరుణాచలమ్ మురుగనాథమ్. ప్యాడ్‌మ్యాన్ సినిమా రాకముందు ఈయన గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో అరుణాచలమ్ పాత్రధారిగా అక్షయ్‌కుమార్ నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భాగ్ మిల్కా భాగ్
మిల్కాసింగ్... 60, 70వ దశకాల్లో మన దేశంలో ఈ పేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ప్రాచుర్యం పొందారు ఈ పరుగుల వీరుడు. ఆసియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించారు. అంతర్జాతీయ పోటీల్లోనూ భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కింది 'భాగ్ మిల్క్ భాగ్' చిత్రం. మిల్కా సింగ్ గురించి నేటి తరం వారికి ఈ చిత్రం తెలియజేసింది. 2013లో వచ్చిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్.. మిల్కా సింగ్‌గా నటించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లయన్
2016లో హాలీవుడ్లో వచ్చిన 'లయన్' చిత్రం మంచి వసూళ్లతో పాటు అవార్డులనూ గెల్చుకుంది. ఆరేళ్ల వయస్సులో రైల్వేస్టేషన్లో తప్పిపోయిన సరూ అనే పిల్లవాడు పాతికేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకుంటాడు. ఆస్ట్రేలియాలో పెంచిన తల్లిదండ్రుల సహకారంతో భారత్‌లో తన కన్నతల్లి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. గూగుల్ ఎర్త్, ఫేస్బుక్ సాయంతో తన తల్లిని చేరుకుంటాడు. హృదయాలను హత్తుకునేలా ఉన్న తన కథను సరూబ్రైర్లీ 'ఏ లాంగ్ వే హోమ్' అనే పుస్తకంగా మార్చాడు. ఈ పుస్తకం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. దేవ్ పాటిల్ సరూబ్రైర్లీగా నటించి ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: