'బిగ్‌బాస్'తో అందరి దృష్టిని ఆకర్షించిన అరియానా.. రాజ్ తరుణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ విషయాన్నే చెబుతూ ఇన్స్టాలో ఫొటోను పోస్ట్ చేసింది.
'అతి త్వరలోనే ఓ ఆసక్తికర విషయం రాబోతుంది. బిగ్‌బాస్ తర్వాత నా జీవితంలోని ఓ మంచి రోజు ఇది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు గవిరెడ్డి శ్రీనుకు ధన్యవాదాలు. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్' అని ట్విట్టర్లో రాసుకొచ్చింది.
అధికారికంగా చెప్పకపోవడం వల్ల అది సినిమా చిత్రీకరణా, మరేదైనా యాడ్ షూటింగ్? అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. త్వరలో ఈ విషయమై స్పష్టత రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">