బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఓ నెటిజన్ చెప్పిన విషయాన్ని ప్రభుత్వానికి సూచించాడు. దీని ప్రకారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
"ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకల్ని రద్దు చేశారు. మనకు మొత్తంగా 3000 రైళ్లు ఉండొచ్చు. వాటి బోగీలన్నీ ఖాళీగా ఉంటాయి. ప్రతి ఒక్కదానిలో 20 గదులు ఉంటాయి. అంటే దాదాపుగా 60,000 మందికి సేవలందిచొచ్చు. వాటినే ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగిస్తే ఆసుపత్రిల కంటే మంచిది కదా" -అమితాబ్ ట్వీట్ చేసిన ఫొటో
-
T 3481 - A most useful idea given on my Insta as a comment :
— Amitabh Bachchan (@SrBachchan) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🙏🇮🇳👏 pic.twitter.com/iV0Ikcs4oV
">T 3481 - A most useful idea given on my Insta as a comment :
— Amitabh Bachchan (@SrBachchan) March 25, 2020
🙏🇮🇳👏 pic.twitter.com/iV0Ikcs4oVT 3481 - A most useful idea given on my Insta as a comment :
— Amitabh Bachchan (@SrBachchan) March 25, 2020
🙏🇮🇳👏 pic.twitter.com/iV0Ikcs4oV
ఈ ట్వీట్‌పై అభిమానులు వెంటనే స్పందించారు. ఇది మంచి నిర్ణయమే కానీ, ఈ ఆలోచన ఉపయోగించే పరిస్థితి రాకుండా మనం జాగ్రతగా ఉండాలని కామెంట్లు చేశారు. మరో అభిమాని.. 'కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్‌ను ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించొచ్చు' అని అన్నాడు.