కరోనా బారి నుంచి ప్రజలను రక్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. "మమ్మల్ని రక్షించడానికి నిర్విరామంగా, నిస్వార్థంగా పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు మా నాన్న రాసిన కవితను అంకితం చేస్తున్నా" అని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు అమితాబ్. ఆరోగ్య కార్యకర్తల కోసం తన తండ్రి హరివంశ్ రాయ్ రాసిన కవితను వారికి అంకితం చేశారు.
-
T 3599 -मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
— Amitabh Bachchan (@SrBachchan) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
कभी नहीं जो तज सकते हैं⁰अपना न्यायोचित अधिकार,⁰
कभी नहीं जो सह सकते हैं⁰शीश नवाकर अत्याचार,⁰
एक अकेले हों या उनके⁰साथ खड़ी हो भारी भीड़;⁰
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
~ HRB
to them that protect us
">T 3599 -मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
— Amitabh Bachchan (@SrBachchan) July 19, 2020
कभी नहीं जो तज सकते हैं⁰अपना न्यायोचित अधिकार,⁰
कभी नहीं जो सह सकते हैं⁰शीश नवाकर अत्याचार,⁰
एक अकेले हों या उनके⁰साथ खड़ी हो भारी भीड़;⁰
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
~ HRB
to them that protect usT 3599 -मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
— Amitabh Bachchan (@SrBachchan) July 19, 2020
कभी नहीं जो तज सकते हैं⁰अपना न्यायोचित अधिकार,⁰
कभी नहीं जो सह सकते हैं⁰शीश नवाकर अत्याचार,⁰
एक अकेले हों या उनके⁰साथ खड़ी हो भारी भीड़;⁰
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़।
~ HRB
to them that protect us
"నేను వారితో ఉన్నాను. వారు వెన్నెముకను ఎప్పుడూ నిటారుగా ఉంచి పనిలో తమ దృష్టిని ఉంచుతారు. వారు న్యాయం చేసే హక్కును ఎప్పటికీ వదులుకోలేరు. వారు ఒంటరిగా ఉన్నా లేక సమూహంగా ఉన్నా వారందరితో నేను వెన్నెంటే ఉన్నా"
-అమితాబ్ ట్విట్టర్ పోస్ట్ సారాంశం
ఈ కవిత్వంతో పాటు రెండు పెన్సిల్ స్కెచ్ చిత్రాలను కలిపి ఇన్‌స్టాలో పంచుకున్నారు అమితాబ్. మొదటి చిత్రంలో ఆరోగ్య కార్యకర్త ముసుగు ధరించి, చేతిలో గులాబీని పట్టుకుని ఉండగా.. రెండో చిత్రంలో బచ్చన్ స్కెచ్ ఉంది.
అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు ఇటీవలే కరోనా సోకడం వల్ల, ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రతిఒక్కరి సందేశాల ద్వారా వారి ప్రేమను పొందినట్లు ట్విట్టర్ వేదికగా బిగ్‌బీ పంచుకున్నారు.