ETV Bharat / sitara

దర్శకుడిని కాపీ కొట్టా అందుకే ప్రశంసలు: నితిన్​ - nithin rashmika movie bheesma

నితిన్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇటీవలె విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్​ వేదికగా విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

bheesma
భీష్మ విజయోత్సవ వేడుక
author img

By

Published : Feb 25, 2020, 9:01 PM IST

Updated : Mar 2, 2020, 1:56 PM IST

దర్శకుడిని కాపీ కొట్టాను అందుకే మెచ్చుకున్నారు

టాలీవుడ్​ హీరో నితిన్, యువ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'భీష్మ'. రష్మిక కథానాయిక. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. సేంద్రీయ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించి.. ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ప్రేక్షకులకు, దర్శకుడు వెంకీకి ధన్యవాదాలు తెలిపాడు హీరో నితిన్​. ఈ చిత్ర విజయం వెనుక దర్శకుడి శ్రమ చాలా ఉందని... అతడిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు నితిన్​.

"సినిమాలో కామెడీ టైమింగ్​, నటన చాలా బాగుందన్నారు ప్రేక్షకులు. వెంకీ నాకు కథ చెప్పిన విధానం , యాక్టింగ్​ చేసి చూపిన తీరులోనే నేను నటించాను. అచ్చం అదే కాపీ కొట్టాను. అందుకే అందరూ నా నటనను ప్రశంసిస్తున్నారు. ఎప్పటికీ ఈ విజయాన్ని మర్చిపోలేను."

-నితిన్​, కథానాయకుడు.

కథానాయిక రష్మిక కూడా చిత్రబృందానికి, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపింది. సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిందీ అందాల భామ.

"నితిన్​.. మిమల్ని సినిమాలో భీష్మగా చూసినప్పడు మీకు అభిమాని అయిపోయాను. మీ టైమింగ్​, స్టైల్​, ప్రతిదీ నాకు బాగా నచ్చింది. సినిమాకి కష్టపడి పనిచేసిన ప్రొడక్షన్​ బాయ్స్​, లైట్​ బాయ్స్​, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు."

-రష్మిక, కథానాయిక.

బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాధున్‌' చిత్రం.. ప్రస్తుతం తెలుగులో రీమేక్‌ అవుతోంది. ఇందులో నితిన్​ హీరోగా కనిపించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 24న హైదరాబాద్​లో పూజా కార్యక్రమం నిర్వహించింది చిత్రబృందం.

ఇదీ చూడండి : వైరల్​: అదిరిపోయే స్టెప్పులతో జాన్వీ సందడి​

Last Updated : Mar 2, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.