పవర్‌స్టార్ అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లానాయక్'(Bheemla Nayak Updates) చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాలోని 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఇప్పుడా చిత్రంలోని రెండో పాట(Bheemla Nayak Song Lyrics) 'అంత ఇష్టం'ను దసరా సందర్భంగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ఆ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో పవన్ కల్యాణ్‌తో పాటు నిత్యా మేనన్(Bheemla Nayak Heroine) ఉన్నారు.
-
Get ready for the other side of our #BheemlaNayak ♥️
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The alluring 2nd Single ~ #AnthaIshtam... out on 15th Oct ✨
A @MusicThaman Musical!🎹@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/MD0pQ2wyQQ
">Get ready for the other side of our #BheemlaNayak ♥️
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2021
The alluring 2nd Single ~ #AnthaIshtam... out on 15th Oct ✨
A @MusicThaman Musical!🎹@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/MD0pQ2wyQQGet ready for the other side of our #BheemlaNayak ♥️
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2021
The alluring 2nd Single ~ #AnthaIshtam... out on 15th Oct ✨
A @MusicThaman Musical!🎹@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/MD0pQ2wyQQ
మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'భీమ్లా నాయక్'(Pawan Kalyan Bheemla Nayak) పాత్రలో పవన్.. డేనియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్, రానా పాత్రలకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్(Trivikram Bheemla Nayak) స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న(Bheemla Nayak Release Date) సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
పవన్.. ఈ చిత్రంతో పాటు 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu Story), 'భవదీయుడు భగత్ సింగ్'(Pawankalyan Harish Shankar Movie), సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్నారు. ఇక రానా.. త్వరలోనే 'విరాట పర్వం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదీ చూడండి.. ఇంటి భోజనాన్ని తిరస్కరించిన ఆర్యన్ ఖాన్!