నేడు నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళుల అర్పిస్తున్నారు ప్రముఖులు, అభిమానులు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ను స్మరించుకుంటూ ఓ సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరారు.
"ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ" అంటూ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు చిరు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">