సంజయ్ లీలా భన్సాలీ తన మేన కోడలైన షర్మిన్ సెగల్, జావేద్ జాఫ్రే కుమారుడైన మెజాన్ జాఫ్రేను 'మలాల్' సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో సంజయ్ భావోద్వేగంతో మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం షర్మిన్ చాలా కష్టపడిందని, 90 కేజీలున్న ఆమె బరువు తగ్గిందని తెలిపాడు.
"బాజీరావ్ మస్తానీకి షర్మిన్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే కాస్ట్యూమ్ ట్రయల్ కోసం మెజాన్ను పరిచయం చేసింది షర్మిన్. అప్పుడే అనుకున్నాను ఇండస్ట్రీకి ఓ స్టార్ వచ్చాడని. ఈ చిత్రంలో ఇద్దరూ చాలా బాగా నటించారు" -సంజయ్ లీలా భన్సాలీ, బాలీవుడ్ దర్శకనిర్మాత.
"ఏ రంగంలోనైన బంధుప్రీతి ఉంటుంది. చిత్ర సీమలో అది త్వరగా కనిపిస్తుంది. తెలిసిన వాళ్లుంటే అవకాశాలు వెంటనే రావచ్చు, కానీ ఆ తర్వాత కష్టపడి తమను తాము నిరూపించుకోవాలి" -షర్మిన్ సెగల్
తెలుగు సినిమా '7జీ బృందావన్ కాలనీ' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మంగేశ్ హడవాలే దర్శకుడు.
ఇది చదవండి: '7జీ బృందావన్ కాలనీ' ట్రైలర్ విడుదల