తెరపై నటీనటులు అందంగా కనిపించాలన్నా, వికృత రూపంతో భయపెట్టాలన్నా మేకప్ కీలకం. అయితే సినిమాల్లో నిర్మాణ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ప్రోస్థటిక్ మేకప్‌కు ఆదరణ పెరిగింది. బయోపిక్‌లు, హారర్ కథలకు ఈ సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే వచ్చిన 'బేతాళ్' వెబ్‌సిరీస్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పింది నటి ఆహనా కుమ్రా. ఏకంగా 45 రోజుల పాటు ఈ మేకప్‌ను భరించినట్లు పేర్కొంది.
రోజూ రెండు గంటలు
తన పాత్ర కోసం ప్రతిరోజు రెండు గంటల పాటు ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవాల్సి వచ్చేదని ఆహనా చెప్పింది. ఇది వేసుకుని, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేస్తే, కనీసం చెమట పట్టేది కాదని తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నప్పుడు ప్రోస్థటిక్స్ వేసుకోవాల్సి ఉంటుందని తెలియదు. ఏకంగా 45 రోజులు ఆ మేకప్ వేసుకున్నా. అంతకుముందు అసలు ప్రోస్థటిక్స్ అంటే ఏంటో తెలియదు. షూటింగ్ మొదలయ్యాక దానితో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆర్టిస్ట్ ఎంత జాగ్రత్తగా ఉండాలనేది అర్థమైంది. ఆ మేకప్ వల్ల, నాకు చెమట పట్టేది కాదు. యాక్షన్ తరహా సీన్లు ఉండటం వల్ల 45 డిగ్రీల ఎండలో పనిచేయాల్సి వచ్చింది. వేడి, ధూళి, వర్షం సహా భిన్న వాతావరణంలో పనిచేశాను. అయితే మేకప్ పోకుండా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. లేదంటే మళ్లీ రెండు గంటలు ఆ మేకప్ వేయడానికి సమయం పడుతుందని తెలుసు. ప్రోస్థటిక్ వల్ల చాలా ప్రత్యేక అనుభూతి పొందాను"
--ఆహనా కుమ్రా, నటి
అందరూ ఆశ్చర్యపోయారు!
"ప్రోస్థటిక్ ధరించడానికి చాలా ఓర్పు, సహనం అవసరం. అన్ని గంటలు కదలకుండా ఉండాలి. పెయింటింగ్, స్టిక్కింగ్ లాంటి పనులు చేస్తారు. తొలిసారి నా మేకప్ చూశాక అందరూ భయపడ్డారు. అయితే నేను మాత్రం షూటింగ్లో ప్రదర్శన కోసమే ఆలోచించేదాన్ని. చివరికి మంచి ఫలితం వచ్చింది. నేనైతే కొత్త విషయం నేర్చుకున్నా" అని ఆహనా తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆహనాకు మేకప్ కోసం ప్రముఖ ఆర్టిస్టులు రెబెక్కా బట్టర్వర్త్, కరోలినా పనిచేశారు. హారర్ కథతో తీసిన ఈ సిరీస్‌లో వినీత్ కుమార్, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించారు. మే 24 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.