ETV Bharat / sitara

ఉమెన్స్ డే: మరపురాని మహిళా ప్రాధాన్య తెలుగు సినిమాలు - anushka cinemas

తెలుగులో మహిళా ప్రాధాన్య సినిమాలు అంటే మీకు టక్కున గుర్తొచ్చేవి ఏవి? ఒకవేళ తెలియదా. అయితే ఈ కథనం చదివేయండి. 80వ దశకం నుంచి ఇప్పటివరకు వచ్చిన వాటిలో ప్రేక్షకాదరణ పొందిన అలాంటి కొన్ని చిత్రాల విశేషాలు మీకోసం.

ఉమెన్స్ డే: మరపురాని మహిళా ప్రాధాన్య తెలుగు సినిమాలు
టాలీవుడ్ మహిళా ప్రాధాన్య సినిమాలు
author img

By

Published : Mar 8, 2020, 2:38 PM IST

Updated : Mar 8, 2020, 4:30 PM IST

కమర్షియల్ సినిమాల ఫార్ములాను దాటి ప్రయోగాల జోలికి వెళ్లేందుకు దర్శక నిర్మాతలు భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అడపాదడపా మహిళా శక్తిని చాటే సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నారు. అలా తీసిన వాటిలో కొన్ని సంచలన విజయాలు నమోదు చేసి, కాసుల పంట పండించి సూపర్‌ హిట్​లుగా నిలిచాయి. అందులో నటించిన కథానాయికలు వెండితెరపై చెరగని ముద్ర వేశారు. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి గురించి, ఆ సినిమాల గురించి ప్రత్యేక కథనం.

సితార

1984లో వచ్చిన రొమాంటిక్​ మ్యూజికల్​ ​ఎంటర్​టైనర్​ 'సితార'. ఈ సినిమాలో హీరోయిన్ భానుప్రియ పలికించిన హావాభావాలు, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇళయారాజా స్వరాలను సమకూర్చాడు. సుమన్​, శుభలేఖ సుధాకర్​ కీలక ప్రాతధారులు.

కర్తవ్యం

రాజకీయ, యాక్షన్​ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. లేడీ సూపర్​స్టార్​ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించింది. 1990లో విడుదలైన సినిమాకు పరుచూరి బ్రదర్స్​ కథనందించారు. మోహన గాంధీ దర్శకుడు. ఇందులో విజయశాంతి నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది.

vijaya shanthi in karthavyam
కర్తవ్యం సినిమాలో విజయశాంతి

ఒసేయ్‌ రాములమ్మ

ఇందులోనూ విజయశాంతి ప్రధాన పాత్రధారి. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించారు. భూస్వాముల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాలు అరాచకాల నేపథ్యంలో దీనిని తీశారు. సూపర్​స్టార్​ కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు.

vijaya shanthi in osey ramulamma
'ఒసేయ్ రాములమ్మా' సినిమాలో విజయశాంతి

ప్రతిఘటన

ఇందులో గృహిణి పాత్రలో నటించింది లేడీ సూపర్​స్టార్ విజయశాంతి. అధికార రాజకీయ పార్టీ అండతో సమాజంలో అక్రమాలకు పాల్పడుతున్న కొంత మంది గూండాల చేతిలో ఆమె జీవితం ఛిద్రమైపోతుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను దుండగులు వివస్త్రను చేస్తారు. తనకు జరిగిన ఆ అన్యాయాన్ని ఎదుర్కొని, ​వాళ్లను ఎలా మట్టికరిపించి, సమాజంలో మార్పు సాధించింది అన్నదే కథాంశం.

prathighatana cinema poster
ప్రతిఘటన సినిమా పోస్టర్

మయూరి

మయూరి... ప్రముఖ నృత్యకారిణి సుధాచంద్రన్​ బయోపిక్​. తన సినిమాలో తానే టైటిల్​ రోల్​లో కనిపించి, ప్రేక్షకులను హృదయంలో స్థానం సొంతం చేసుకుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి 14 నంది అవార్డులు రావడం విశేషం. ఈ అద్భుత దృశ్య కావ్యానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు.

sudha chandran
మయూరిలో నటించిన సుధా చంద్రన్

అంతఃపురం

ఫ్యాక్షన్, లవ్​ కథాంశాలతో​ 1998లో వచ్చిన సినిమా 'అంతఃపురం'. నటి సౌందర్య ఇందులో కీలక పాత్రలో కనిపించి, కన్నీరు తెప్పించింది! సాయికుమార్​, జగపతిబాబు, ప్రకాశ్​రాజ్​ ఇతరపాత్రలు పోషించారు. మానవ సంబంధాలు గురించి ఇందులో చాలా చక్కగా వర్ణించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఇళయరాజా అందించిన స్వరాలు ఈ చిత్రవిజయానికి కారణమయ్యాయి.

అరుంధతి

అనుష్క అంటే అరుంధతి-అరుంధతి అంటే అనుష్క అనేలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందీ సినిమా. రౌద్రమైన కళ్లు, ముఖంలో గంభీరం, విభిన్న ఆహార్యంతో సినీ అభిమానులు కట్టిపడేసిందీ భామ. ఈ చిత్రంతోనే తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్​ను ఏర్పాటు చేసుకుంది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

నేటితరం హీరోయిన్లలో ఒకరకంగా అనుష్కతోనే మహిళా ప్రాధాన్య​ సినిమాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. 2009లో వచ్చిన ఈ చిత్రం.. సంచలన విజయం నమోదు చేసింది. ఇందులో విలన్​గా నటించిన సోనూసూద్.. ఇప్పటికీ చాలా మందికి పశుపతిగానే గుర్తుండిపోయాడు.

scene in arundhathi cinema
అరుంధతి సినిమాలోని ఓ సన్నివేశం

రుద్రమదేవి

రాణి రుద్రమదేవి జీవితం ఆధారంగా తీసిన త్రీడి సినిమా 'రుద్రమదేవి'. ఇందులోనూ అనుష్క.. రుద్రమదేవి పాత్ర​ పోషించింది. రానా, అల్లు అర్జున్, నిత్యామేనన్​, సీనియర్​ నటుడు కృష్ణంరాజు​ ఇతర పాత్రల్లో కనిపించారు. గుణశేఖర్​ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది.

Last Updated : Mar 8, 2020, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.