'1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల్ని తొలి పరిచయంలోనే మెప్పించింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకున్న ఆమె.. టైగర్ ష్రాఫ్ సరసన 'హీరోపంటి' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం విడుదలై నేటితో ఏడేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడింది కృతిసనన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఓ నటిగా బలమైన పాత్రల్ని పోషించాలనుకుంటున్నా. ఇప్పటివరకు కనిపించని కొత్త పాత్రల్ని ఎంపిక చేసుకునే దిశగా సాగుతున్నాను. అదృష్టవశాత్తూ నా ఏడేళ్ల ప్రయాణంలో విభిన్న కథా చిత్రాల్లో నటించాను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేందుకు విభిన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం సవాలుతో కూడిన పని. అయినా అందులో సంతృప్తి దొరుకుతుంది. అలాంటి పాత్రలకు న్యాయం చేయగలనని ఆశిస్తున్నా."
- కృతిసనన్, బాలీవుడ్ నటి
ప్రస్తుతం కృతి చేతిలో ఏడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్', హిందీ సినిమాలు 'గణపత్', 'భెడియా', 'మిమీ', 'బచ్చన్ పాండే', 'హమ్ దో హమారే దో', టైటిల్ ఖరారు చేయని మరో సినిమాతో బిజీగా ఉంది ఈ భామ.
ఇదీ చూడండి.. మెడికల్ ఎమర్జెన్సీ అన్నా వినలేదు: నిఖిల్