ETV Bharat / sitara

ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఉత్తమ సిరీస్​లు ఇవే! - స్టేట్ ఆఫ్ సీజ్ 26/11

ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సినిమాలు, వెబ్ సిరీస్​లు ప్రేక్షకుల్ని అలరించాయి, అలరిస్తూనే ఉంటాయి. దేశభక్తితో పాటు యాక్షన్ ఘట్టాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలా ఆర్మీ నేపథ్యంలో వచ్చిన ఉత్తమ సిరీస్​లపై ఓ లుక్కేద్దాం.

Best Indian Web Series Based On Army
ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఉత్తమ సిరీస్​లు ఇవే!
author img

By

Published : Jan 21, 2021, 8:57 AM IST

Updated : Jan 21, 2021, 9:44 AM IST

మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు, వెబ్ సిరీస్​లకు మంచి గిరాకీ ఉంది. అందుకే వార్, ఆర్మీ కథలతో చిత్రాలు, సిరీస్​లు రూపొందించడానికి మొగ్గు చూపిస్తారు దర్శకనిర్మాతలు. ఇందులోని సన్నివేశాలు ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో దేశభక్తిని రెట్టింపు చేస్తాయి. అందులోనూ ఇలాంటి షోలకు ఫ్యాన్ బేస్ బలంగా ఉంటుంది. భారత్​లో ఇలాంటి సినిమాలు, సిరీస్​లు చాలానే వచ్చాయి. అందులో అత్యుత్తమైన వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.

ది ఫర్గటెన్ ఆర్మీ (అమెజాన్ ప్రైమ్)

స్వాతంత్య్రోద్యమ సమయంలో సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన నేషనల్ ఆర్మీ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ షోలో సన్నీ కౌశల్, శర్వారి కీలక పాత్రలు పోషించారు. రెండో ప్రపంచ యుద్ధ పోరులో లెఫ్ట్​నెంట్ సోధీ, అతడి ఆర్మీ ఎలా పోరాడిందో, ఎలాంటి త్యాగాలు చేసిందో తెలుపుతూ ఈ స్టోరీని అల్లుకున్నారు. ఈ సిరీస్​ చూసిన వారు భారత ఆర్మీతో పాటు దేశం పట్ల ఎంతో గర్వపడతారు.

Best Indian Web Series Based On Army
ద ఫర్గటన్ ఆర్మీ

ఫౌజీ (ఎంఎక్స్ ప్లేయర్)

షారుక్ ఖాన్​ బుల్లితెరపై అరంగేట్రం చేసిన టెలివిజన్ సిరీస్ 'ఫౌజీ'. దీనికి రాజ్​ కుమార్ కపూర్ దర్శకత్వం వహించారు. భారత ఆర్మీలో రిక్రూట్​మెంట్, వారి కమాండో ట్రైనింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ షో 90వ దశకంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రతి పాత్రకు సమన్యాయం చేస్తూ, పాత్రల మధ్య అద్భుత కెమిస్ట్రీని పండిస్తూ రూపొందించిన ఈ షో ఓ క్లాసిక్​గా నిలిచిపోయింది.

Best Indian Web Series Based On Army
ఫౌజీ

కోడ్ ఎం (జీ5)

జగ్గర్​నాట్ క్రియేట్ చేసి నిర్మించిన వెబ్ సిరీస్ 'కోడ్ ఎం'. జెన్నీఫర్ వింగెట్, రజత్ కపూర్, సీమా బిస్వాస్, తనుజ్ విర్వాన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఉగ్రవాదుల ఎన్​కౌంటర్​లో చనిపోయిన ఓ ఆర్మీ ఆఫీసర్ కేసును మోనికా మెహ్రా అనే మిలిటరీ లాయర్ ఎలా ఛేదించిందనేది కథ. ఆర్మీ లాయర్ పాత్రలో జెన్నిఫర్ అద్భుతంగా నటించింది. నిడివి తక్కువ గల ఎపిసోడ్స్, బలమైన పాత్రలతో ఈ షో ఆకట్టుకుంటుంది.

Best Indian Web Series Based On Army
కోడ్ ఎం

స్టేట్ ఆఫ్ సీజ్ 26/11 (జీ5)

సందీప్ ఉన్నిథాన్​ పుస్తకం 'బ్లాక్ టోర్నడో: ద త్రీ సీజెస్ ఆఫ్ ముంబయి 26/11' ఆధారంగా 'స్టేట్ ఆఫ్ సీజ్ 26/11'ను తెరకెక్కించారు. అర్జున్ బజ్వా, అర్జున్ బిజ్లానీ, ముకుల్ దేవ్, తారా అలిషా బెర్రీ, సిద్ మక్కద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఆపరేషన్ సమయంలో జరిగిన సన్నివేశాల్ని తెరకెక్కించడంలో సఫలమైంది చిత్రబృందం. ముంబయి 26/11 దాడుల్లో భద్రతా దళాలు ఏ విధంగా ప్రజల ప్రాణాల్ని కాపాడాయి, ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టాయి అనే కథతో దీనిని రూపొందించారు. ఇందులో వాడిన కాస్ట్యూమ్స్, గన్స్ కాస్త చవకగా కనిపించినా.. ఈ దాడుల గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ సిరీస్ తప్పకుండా చూడాలి,

Best Indian Web Series Based On Army
స్టేట్ ఆఫ్ సీజ్ 26/11

బేతాళ్ (నెట్​ఫ్లిక్స్)

పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్​ జాంబీస్ నేపథ్యంలో తెరకెక్కింది. వినీత్ కుమార్ సింగ్, అహనా కుమ్రా ప్రధాన పాత్రల్లో కనిపించారు. షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్, నెట్​ఫ్లిక్స్​ నిర్మాణంలో ఇది రెండో సిరీస్. ఈస్ట్ ఇండియా కంపనీ అధికారులు జాంబీలుగా మారి చిన్న గ్రామంలోని భద్రతా బలగాలపై ఎలా దాడులు చేశారనేది కథ.

Best Indian Web Series Based On Army
బేతాళ్

ఇవీ చూడండి: మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ షురూ

Last Updated : Jan 21, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.