'రాక్షసుడు' సినిమాతో హిట్ అందుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. అదే ఉత్సాహంతో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ఈరోజు టైటిల్ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. 'అల్లుడు అదుర్స్' అనే పేరు ఖరారు చేశారు. గతంలో ఈ కథానాయకుడు 'అల్లుడు శీను' సినిమాతో అరంగేట్రం చేశాడు. మరోసారి ఈ అల్లుడు సెంటిమెంట్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
![alludu adhurs cinema poster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6380806_alludu-adhurs.jpg)
ఇందులో నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోనుసూద్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.