హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ సామాజిక మాధ్యమాల్లో టాప్‌లెస్ ఫొటోలు పెట్టి నిరసన వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ చిత్రాలను నెట్టింట ఉంచింది.
హ్యాకర్, బెల్లా మధ్య జరిగిన సంభాషణలతో పాటు ఆ ఆగంతుకుడు పంపిన చిత్రాలను స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.
"నిన్న ఒక వ్యక్తి నా ఖాతాను హ్యాక్ చేశాడు. నా నగ్న ఫొటోలతో పాటు మరికొంత మంది సెలబ్రిటీస్ నగ్న చిత్రాలనూ నాకు పంపాడు. దీనిని చూసి ఆవేదన చెందా. అతను ఇంతటితో ఆగేలా లేడు. అందుకే నా ఫొటోలను నేనే సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నా. ఇంతకంటే అతడు చేసేదేమీ లేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా. నా జీవితాన్ని ఎవరూ నియంత్రించలేరు. హ్యాకర్ పంపిన ఫొటోస్ ఇవే" అని ట్వీట్ చేసింది.
ఇవీ చూడండి.. భారీ సెట్స్‌లో 'కేజీఎఫ్2' షూటింగ్!