పాటలు, నృత్యాలు, అద్భుత సాంకేతికతతో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం ‘బ్యూటీ అండ్ ద బీస్ట్’ (2017). బిల్ కాన్డన్ దర్శకత్వం వహించారు. అందాల తార ఎమ్మా వాట్సన్, డేనియల్ స్టీవెన్, ల్యూక్ ఎవాన్స్ తదితరులు ఇందులో నటించారు.
- పేదమ్మాయి ఆలోచన:
'బ్యూటీ అండ్ ద బీస్ట్' కథను 1740లో గాబ్రియెల్ సుజానే బార్బోట్ డీ విల్లెన్యువే అనే ఫ్రెంచి రచయిత్రి రాసింది. ఇందులోని సారాంశాన్ని కుదించి 1756లో కొత్త వెర్షన్లో రాసింది జియానే మేరీ లేప్రిన్స్ డెబ్యూమాంట్. ఈమె పదకొండేళ్లకే తల్లిని కోల్పోయిన అమ్మాయి. ఓ ధనవంతురాలి సాయంతో చదువుకుని తన రచనలతో ఎందరినో మెప్పించింది.
ఈ కొత్త కథనే వాల్ట్‌డిస్నీ సంస్థ 1991లోనే ఓ యానిమేషన్ సినిమాగా తీసింది. 172 కోట్ల రూపాయలతో తీయగా అప్పట్లోనే 2వేల 930 కోట్ల వసూళ్లు కురిపించి సంచలనం సృష్టించింది. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్ లాంటి అవార్డులనూ గెలుచుకుంది.
మళ్లీ ఇదే కథాంశంతో సాంకేతికత జోడించి 2017లో లైవ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 26 సంవత్సరాల కాలంలో ఆ కథ రేంజ్ 2వేల కోట్ల నుంచి 86వేల కోట్లకు పెరిగిపోయిందంటే ఎంత క్రేజ్ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఇంతకీ ఆ కథేంటి:
అనగనగా ఓ రాకుమారుడు. అతడికి అహంకారం ఎక్కువ. ఓ తుపాను నాటి రాత్రి ఓ దేవకన్య బిచ్చగత్తె రూపంలో వస్తుంది. ఆ రాత్రి ఇంట్లో తలదాచుకోనివ్వమని కోరుతూ ఓ గులాబీని కానుకగా ఇవ్వబోతుంది. ఆ రాకుమారుడు పొగరుతో ఆమెను బయటకి గెంటిస్తాడు. అప్పుడు దేవకన్య తన నిజరూపాన్ని చూపించి శపిస్తుంది. ఫలితంగా అతడు ఓ వికృత రూపం గల రాక్షసుడిగా మారతాడు.
ఆ కోటలోని సేవకులంతా రకరకాల వస్తువులుగా మారిపోతారు. మరి శాప విమోచనం ఏమిటి? ఆ రాక్షసుడు ఓ అందమైన అమ్మాయి మనసు గెలుచుకోవాలి. ఆమె ప్రేమతో అతడికి ఓ ముద్దు పెట్టాలి. ఇదంతా ఆ పెరట్లో ఓ అందమైన గులాబీ పువ్వు ఆఖరి రేకు రాలి పడిపోయేలోగా జరగాలి. లేకపోతే అతడు ఎప్పటికీ రాక్షసుడిగానే మిగిలిపోతాడు. ఏళ్లు గడుస్తున్నాయి. ఒక్కో ఏడాది ఒక్కో గులాబీ రేకు పడిపోతుంటుంది. ఇక ఆఖరికి ఒకే ఒక రేకు మిగిలింది. అప్పుడా కోటలోకి ఓ వ్యక్తి వచ్చి, తన కూతురు కోసం ఓ గులాబీని కోసుకుంటాడు. ఆ రాక్షసుడు కోపంతో అతడిని బంధిస్తాడు. తండ్రిని విడిపించడం కోసం అతడి కూతురు ఆ కోటలోకి వస్తుంది. ఆ అమ్మాయిని మంచి చేసుకోడానికి ప్రయత్నించిన రాక్షసుడికి చివరికి శాపవిమోచనం కలిగిందా.? అతడి వికృత రూపాన్ని చూసి భయపడకుండా అతడిని ప్రేమించిందా? అనేదే కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఈ సినిమాలో బాల్‌రూమ్ డ్యాన్స్ సన్నివేశంలో కథానాయిక ఎమ్మా వాట్సన్ కోసం ప్రత్యేకమైన గౌను కుట్టించారు. ఈ దుస్తులను తయారు చేయడానికి 3,000 అడుగుల దారం అవసరమైంది. సుమారు 12వేల పనిగంటలు సమయం పట్టింది. ఆ గౌను మీద 2,160 క్రిస్టల్స్‌ను కుట్టారు.