మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు(MAA Elections) క్రమేపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్లో పరిస్థితులు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్ రాజ్(Prakash Raj MAA Elections), మంచు విష్ణు(Manchu Vishnu MAA Elections) ప్రధానంగా పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ జోరుగా 'మా' ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. 'మా' జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh MAA Elections) శుక్రవారం కీలక నిర్ణయం ప్రకటించారు. 'మా' ఎన్నికల బరి నుంచి తాను తప్పుకొంటున్నట్లు ట్వీట్ చేశారు. సన్నిహితుల, ఆత్మీయుల సూచన మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు బండ్ల గణేశ్ వెల్లడించారు.
-
నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. @actorsrikanth @prakashraaj 👍 pic.twitter.com/s6zx2MqCFL
— BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. @actorsrikanth @prakashraaj 👍 pic.twitter.com/s6zx2MqCFL
— BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. @actorsrikanth @prakashraaj 👍 pic.twitter.com/s6zx2MqCFL
— BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021
"నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను" అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.
'మా' ఎన్నికల్లో(MAA Elections 2021) మొదట ప్రకాశ్ రాజ్ ప్యానల్లో ఉన్న బండ్ల గణేశ్.. అనుహ్యంగా ఆ ప్యానల్ నుంచి తప్పుకొని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగారు. జనరల్ సెక్రటరీగా తనను ఎన్నుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేశ్ విన్నూత్న ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం ఆ పోటీ నుంచి వైదొలగినట్లు బండ్ల గణేశ్ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నటులు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్‌లతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఇదీ చూడండి.. Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ