'వకీల్‌సాబ్' చిత్రంతో ఇటీవలే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్, హరీశ్ శంకర్ దర్శకత్వంలోని సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నిర్మాత బండ్ల గణేశ్‌తో పవన్ ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి 'ఖిలాడి' డైరెక్టర్ రమేశ్ వర్మ తెరకెక్కించనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై సదరు నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు.
రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుందని జరుగుతున్న ప్రచారాన్ని బండ్ల గణేశ్ ఖండించారు. అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. పవన్‌తో సినిమా విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు.
ఇదీ చూడండి.. క్లాసికల్ హిట్ 'గోదావరి' సినిమాకు 15 ఏళ్లు!