ETV Bharat / sitara

బాలయ్య-బోయపాటి చిత్రం టైటిల్ ఖరారు! - బాలయ్య-బోయపాటి గాడ్ ఫాదర్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్​కు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Balayya-Boyapati new film
బాలయ్య-బోయపాటి
author img

By

Published : Feb 19, 2021, 4:00 PM IST

Updated : Feb 19, 2021, 4:14 PM IST

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. 'బీబీ3' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి.

తాజాగా ఈ సినిమాకు 'గాడ్ ఫాదర్' అనే పేరును చిత్రబృందం ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ మధ్య బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'బీబీ3' ఫస్ట్ రోర్ పేరట ఓ వీడియో విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. అందులో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు. సినిమా ఈ ఏడాది మే 28న విడుదల కానుంది.

Last Updated : Feb 19, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.