టాలీవుడ్ హీరో బాలకృష్ణ కొత్త సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమానికి దర్శకులు వి.వి.వినాయక్, కోదండరామిరెడ్డి, బోయపాటి శ్రీను హాజరయ్యారు. కేఎస్ రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ దర్శకుడితో ఇంతకుముందే 'జై సింహా' సినిమాలో నటించారు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'క్రాంతి' అనే వినూత్న టైటిల్ పెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్‌గా కనిపించనున్నాడని సమాచారం. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుకానుంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసే అవకాశముంది.
ఇది చదవండి: పోరాటాల 'సాహో'- అదరగొట్టిన ప్రభాస్