ETV Bharat / sitara

ఆ జీపు పంపితేనే షూటింగ్​కు వస్తానన్న బాలయ్య!

author img

By

Published : Jun 10, 2021, 7:02 AM IST

నందమూరి బాలకృష్ణ (Balakrishna) అంటే దర్శకుల హీరో అని పేరు. డైరెక్టర్ల​ను ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వారు ఏమి చెబితే అదే చేస్తుంటారు అని అంతా అంటారు. అయితే ఓ సినిమా కోసం ఆయన ఓ షరతు పెట్టారని తెలిసింది. అలా చేస్తేనే షూటింగ్​కు వస్తారని అన్నారట. అదేంటంటే?

balayya
బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బి.గోపాల్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వారిద్దరి కలయికలో వచ్చిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' (Rowdy Inspector) బంపర్‌ హిట్‌ సినిమా. ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ చిత్రం నమోదు చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఆ చిత్రీకరణకు రావడానికి బాలకృష్ణ (Balakrishna) ఓ కండిషన్‌ పెట్టారంటే నమ్ముతారా. అదేంటి బాలయ్య దర్శకుల హీరో కదా.. అలాంటి ఇబ్బందులేం పెట్టడంటారే అనుకుంటున్నారా? ఆ షరతు ఏంటో తెలిస్తే బాలకృష్ణ నటన మీద ఉన్న ప్యాషన్‌ ఏంటో తెలుస్తుంది. అది ఆ సినిమా హిట్‌ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది కూడా.

బాలయ్య
రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రీకరణలో బాలయ్య

పోలీసు నేపథ్య సినిమాల్లో 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' ఓ ట్రెండ్‌ సెట్టర్‌. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే.. బాలయ్య నటన‌ చూసి ప్రేక్షకులు అదుర్స్‌ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్‌ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు.. జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోయారు. అలానే షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ ఓ సందర్భంలో చెప్పారు.

బాలయ్య
రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రీకరణలో బాలయ్య

"ఓ రోజు ఉదయం బాలయ్య బాబు ఫోన్‌ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదు అన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమాలో నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కు వస్తా.. అప్పుడు ఆ పాత్రలో లీనమవ్వగలను అని చెప్పారు. మేం అలానే జీపు పంపించాం. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య ఆ రోజు పోలీసు జీపులో పోలీసులా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చారు. సినిమా అంటే అంత ప్యాషన్‌ ఆయనకు. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారు" అని బి.గోపాల్‌ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.