నందమూరి బాలకృష్ణ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 'అఖండ'తో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత రెండు సినిమాల షూటింగ్‌ల్లో ఒకేసారి పాల్గొనాలని భావిస్తున్నారట.
మరికొద్ది రోజుల్లో 'అఖండ' చిత్రీకరణ పూర్తి కానుంది. జూన్ లేదా జులైలో ప్రారంభమయ్యే ప్రాజెక్టులో భాగంగా 'క్రాక్' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. ఆ తర్వాత కొన్నిరోజులకు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. వీటిని వరుసగా వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై స్పష్టత రావాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.