ETV Bharat / sitara

బాలయ్యకు ఆ రూమ్​ అంటే సెంటిమెంట్!

author img

By

Published : Jun 10, 2021, 10:53 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కొన్ని సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని రూమ్ నంబర్ 610తో కూడా బాలయ్యకు బలమైన బంధం ఉంది. ఫిల్మ్​ సిటీలో షూటింగ్ జరిగితే బాలయ్య ఆ రూమ్​లో తప్ప మరో రూమ్​లో ఉండరట.

balayya
బాలయ్య

కొన్ని విషయాల్ని కొందరు బలంగా నమ్ముతారు. వాటి వల్ల వారికి కెరీర్​ పరంగానైనా, జీవితంలోనైనా కలిసిరావొచ్చు. నటసింహం నందమూరి బాలకృష్ట(Balakrishna)కు ఇలాంటి సెంటిమెంట్లు కాస్త ఎక్కువే అని దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అలాంటి ఓ సెంటిమెంటుకు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదే 'రూమ్​ నంబర్​ 610'.

ఏంటీ రూమ్​ నంబర్​ 610?

అగ్ర హీరోల సినిమాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరగాల్సిందే. షూటింగ్​ సమయంలో నటులు చాలా మంది ఫిల్మ్​ సిటీ(Ramoji Film CIty)లోనే బస చేస్తుంటారు. అది కూడా ఫైవ్​ స్టార్​ హోటల్​ సితారలో. కానీ బాలయ్య మాత్రం ఇందుకు భిన్నం. ఆయన ఆ హోటల్​లో ఉండరట. పక్కనే ఉన్న త్రీ స్టార్​ హోటల్​ తారలో మాత్రమే బస చేస్తారు. అది కూడా 610వ నంబర్​ గదిలో మాత్రమే.బాలయ్య వచ్చే సమయానికి ఆ రూమ్​లో ఎవరైనా ఉంటే.. వెంటనే ఖాళీ చేయాల్సిందే. ఈ విషయాలన్నీ రామోజీ ఫిల్మ్ సిటీ ఎగ్జిక్యూటివ్ షెఫ్ శివ చెప్పారు. ఎప్పుడూ దక్షిణాది భోజనాన్నే బాలయ్య ఇష్టపడతారని వెల్లడించారు. స్ట్రీట్​బైట్ అనే యూట్యూబ్​ ఛానెల్​లో చేసిన ఓ వీడియోలో ఈ ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ'లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'సింహా', 'లెజెండ్​' సినిమాలతో హిట్లు అందుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్​ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.