ETV Bharat / sitara

మరో కథకు బాలయ్య గ్రీన్​సిగ్నల్​! - గోపీచంద్​ మలినేని వార్తలు

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో కథకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. దర్శకుడు గోపీచంద్​ మలినేని చెప్పిన స్టోరీకి బాలయ్య అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీస్​ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.

Balakrishna so impressed with Gopichand Malineni Story?
మరో కథకు బాలయ్య గ్రీన్​సిగ్నల్​!
author img

By

Published : Dec 18, 2020, 6:53 AM IST

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు బాలకృష్ణ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్న దర్శకుల జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఆయన కోసం సంతోశ్​ శ్రీనివాస్‌తో పాటు శ్రీమన్‌ వేముల అనే మరో యువ దర్శకుడు కథలు సిద్ధం చేశారు. ఈ ఇద్దరికీ బాలయ్య నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందిందని తెలిసింది. ఇప్పుడీ జాబితాలో ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని చేరినట్లు సమాచారం.

ఇప్పటికే ఆయన బాలకృష్ణకు కథ వినిపించారని, త్వరలోనే ఫైనల్‌ స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని మైత్రీ మూవీస్‌ సంస్థలో నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే పునఃప్రారంభమైన ఈ చిత్రం.. వేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. గోపీచంద్​ మలినేని ప్రస్తుతం 'క్రాక్​' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: స్వప్న మాంత్రికుడు స్పీల్‌బర్గ్‌.. వెండితెర అద్భుతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.