నటసింహం నందమూరి బాలకృష్ణకు సరైన మాస్ మసాలా సినిమా పడితే ఎలా ఉంటుందో సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన 'సింహా' నిరూపించింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల ఆకలి తీర్చింది. గెటప్, మేనరిజమ్, డ్యాన్స్, డైలాగ్స్, ఎమోషన్స్, ఫైట్స్, స్టయిల్, రొమాన్స్.. ఇలా అన్నింట్లో బాలయ్య దుమ్ము దులిపేశారు. టాలీవుడ్‌పై దండయాత్ర చేసి ఆహా అనిపించారు.
2004లో వచ్చిన 'లక్ష్మీ నరసింహా' తర్వాత బాలకృష్ణకు సరైన హిట్ పడలేదు. దీంతో అభిమానుల నిరాశలో మునిగిపోయారు. సరిగ్గా అలాంటి సమయంలో వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను.. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గ కథతో సినిమా తీసి, నటసింహం గర్జిస్తే ఎలా ఉంటుందో మరోసారి తెలిసేలా చేశారు.
ఇందులో ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ నరసింహా పాత్రల్లో నటనకుగానూ బాలకృష్ణ నంది అవార్డును అందుకున్నారు. వీటితో పాటే పవర్ఫుల్ డైలాగ్స్, చక్రి సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
అప్పటి లెక్కల ప్రకారం 338 కేంద్రాల్లో 50 రోజులు, 92 సెంటర్లలో 100 రోజులు, 3 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది 'సింహా'.
సినిమాలోని కొన్ని డైలాగ్స్
- పదిమందితో రా.. పదిపది పెంచుకుంటూ రా.. పదిసార్లు రా.. నేను రెడీ
- ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా.. ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా
- కుట్లు వేయడమే కాదు.. పోట్లు కూడా వేస్తాను
- వద్దు ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయలన్న మేమే.. వాళ్లెంత బ్లడీ ఫూల్స్
- అరె నిమిషంలో చచ్చేవాడివి నీ అడ్రస్ నాకెందుకురా!
- కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు
- భయమా? నాకా? నా కాంపౌండ్‌లో కుక్కకు కూడా ఆ పదం అంటే ఏంటో తెలియదు
- నేనెవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను.. ఆప్షన్ ఏ-జబ్బు చేస్తే వైద్యం చేస్తాను. ఆప్షన్ బి- తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా? ఆప్షన్ బి కావాలా? నరకటమా? వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేస్కే.. ఛాయిస్ ఈజ్ యువర్స్.
- చూడు ఒకవైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు తట్టుకోలేవ్, మాడిపోతావ్
- గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్స్