బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో సినిమాకి రంగం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆ చిత్రం మే నుంచే పట్టాలెక్కనుంది. సంక్రాంతికి 'క్రాక్'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని.. తన శైలి మాస్ అంశాలతో బాలకృష్ణ కోసం కథని సిద్ధం చేశారు. ఆ కథని ఇటీవలే విన్న బాలకృష్ణ, సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేసినట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మే 28న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక చిత్రం విడుదల కాక ముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతారన్నమాట.