నందమూరి నటసింహం బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. స్టైలిష్ లుక్‌లో నందమూరి హీరో అదరగొడుతున్నాడు.
ఈ సినిమా రెండో షెడ్యూల్ సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని తెలిపింది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. భూమిక కీలకపాత్రలో కనిపించనుంది.
ఇదే దర్శకుడితో ఇంతకుముందు 'జై సింహా' సినిమాలో నటించాడు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోందీ కాంబో. ఈ చిత్రానికి 'క్రాంతి' అనే టైటిల్ పెట్టాలని భావిస్తోంది చిత్రబృందం. ఇందులో బాలకృష్ణ పోలీస్‌గా కనిపించనున్నాడని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చూడండి.. ఫస్ట్‌లుక్: 'వైకుంఠపురములో' బన్నీ స్టైల్ అదుర్స్