వైట్ అండ్ వైట్ డ్రస్‌లో.. కోర మీసంతో వావ్ అనిపిస్తున్నారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఆయన అభిమానులకు ఈ లుక్ పండగే అని చెప్పొచ్చు. రాజసం ఉట్టిపడే ఈ కొత్త లుక్ 'బీబీ 3' (వర్కింగ్ టైటిల్ ) సినిమాకు సంబంధించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా సెట్స్‌లో మంగళవారం 'తెలంగాణ తెలుగు యువత' బృంద సభ్యులు బాలయ్యను కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బాలయ్య నయా లుక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావడం వల్ల ఈ చిత్రంలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఎస్.ఎస్ తమన్ సంగీతాన్న అందిస్తున్నారు.
ఇదీ చూడండి: జీవిత పాఠాల్ని నేర్చుకున్నా: అభిజీత్