ETV Bharat / sitara

'తను నన్ను బాలా అని పిలుస్తాడు' - బాలకృష్ణ స్పెషల్​ స్టోరి

తండ్రికి తగ్గ తనయుడిగా.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో 'బాలయ్య'గా, 'యువరత్న'గా పేరు తెచ్చుకున్నారు. నేడు ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా బాలకృష్ణ గురించి ప్రత్యేక విశేషాలు మీకోసం..

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Jun 10, 2020, 6:56 AM IST

Updated : Jun 10, 2020, 7:17 AM IST

వయసు అరవై... మనసు ఆరే. మనిషికి షష్టిపూర్తైంది అంతే... హుషారు పదహారేళ్ల ప్రాయంతో పరుగులు తీస్తోంది. తెలిసిపోయిందనుకుంటా... ఇదంతా 'బాల..కృష్ణుడి' గురించి అని. నటనలో ధీరత్వం... సమాజంలో సేవాతత్వం... నందమూరి నటవారసత్వంతో పాటు ఆయనకు వచ్చాయి. సినిమాల్లో కథానాయకుడిగా... రాజకీయాల్లో నాయకుడిగా ఆయన అభిమానుల గుండెల్లో కొలువుదీరాడు.కరోనా నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటూ నియోజకవర్గంలో ప్రజల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే... బోయపాటితో సినిమా బాగా రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం బాలకృష్ణ 60వ పుట్టిన రోజు. ఈ వేడుకను అభిమానుల మధ్య జరుపుకోలేకపోవడం బాధగా ఉందంటున్న ఆయన అంతరంగం 'ఈనాడు సినిమా'కు ప్రత్యేకం.

నందమూరి తారక రామారావు వారసుడిగా అభిమానులు అందరూ నన్ను దీవించడం వల్లే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తా. అందుకే నాకు ప్రతిరోజూ ప్రత్యేకమే. 60వ పుట్టిన రోజనేది ఒక నంబరంతే. వాస్తవానికి నాకు 6ఏళ్లే అనుకుంటా. అందుకే నా మనవళ్లతో కలిసి అల్లరి చేస్తుంటా. వాళ్లు నాకు మంచి స్నేహితులు. పెద్ద మనవడు దేవాన్ష్‌ అల్లరి తాత అంటుంటాడు. చిన్న మనవడు ఆర్యవీర్‌ నన్ను ‘బాల’ అంటుంటాడు. నేను వారిని సీఎం(క్లాస్‌ మనవడు), ఎంఎం(మాస్‌ మనవడు) అని సరదాగా పిలుచుకుంటుంటా(నవ్వుతూ).

balakrishna
బాలకృష్ణ

అదొక్కటే బాధ

ఈ కరోనా మహమ్మారి వల్ల పుట్టిన రోజు వేడుకలను అభిమానుల మధ్య జరుపుకోలేకపోతున్నా. అది చాలా బాధగా ఉంది. లేకపోతే మా ఇంటి ఆవరణంతా ఇప్పటికే వారితో నిండిపోయేది. ఈసారి ఎక్కడి వారక్కడే కేక్‌ కట్‌ చేసి వారి అభిమానాన్ని చాటుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండటం ఆనందం కలిగించే విషయమే. బుధవారం తెల్లవారుజామున లేచి పూజ చేసి, వసుంధర, పిల్లలతో కాసేపు ఉండి... బసవతారకం ఆసుపత్రికి వెళ్తాను.

పాత్రను బట్టే

నా పాత్రను బట్టి డైట్‌ మారిపోతుంటుంది. వ్యాయామాలు దానికి తగ్గట్లు చేస్తా. అన్ని ఆహారపదార్థాలు తింటా... అయితే లిమిట్‌గా. ఇవే నా ఆరోగ్య రహస్యాలు. సినిమాలో పాత్ర పండటానికి బాగా హోంవర్క్‌ చేస్తా. బోయపాటి నా కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కోసం ఇప్పుడు కసరత్తు చేస్తున్నా. మా సినిమా షూటింగ్‌ను ఫైట్‌తోనే ప్రారంభిస్తాం. ఈ చిత్రమూ అంతే. అది మీరు ట్రైలర్‌లో చూడొచ్చు. ఈ వయసులో ఇంత హుషారంటారా... అది నాన్న జీన్స్‌ నుంచి వచ్చిందంతే!

balakrishna
బాలకృష్ణ

చంఘీజ్‌ఖాన్‌ చేయాలి

పౌరాణిక, జానపద, సాంఘిక, ప్రయోగాత్మక చిత్రాలెన్నో చేశాను. చంఘీజ్‌ఖాన్‌, గోనగన్నారెడ్డి... వంటి పాత్రలు చేయాలనుంది. ఆదిత్య 999 పూర్తిచేయాలి. నా దర్శకత్వంలో ‘నర్తనశాల’ మొదలుపెట్టి ఆపేశా. త్వరలోనే తప్పకుండా దర్శకత్వం చేస్తా.

జమునతో ముచ్చట్లు

నాన్న సినిమాలు చూస్తుంటా. ఉదయాన్నే 'మిస్సమ్మ' చూశా. గుండమ్మ కథ, గులేబకావలి కథ లాంటి చిత్రాలు తరచూ చూస్తుంటా. నాన్న పాడిన పద్యాలను మననం చేసుకుంటుంటా.జమునకు ఫోన్‌ చేసి మాట్లాడతా. వీలైతే ఆమె దగ్గరికెళ్లి అప్పటి కబుర్లు చెప్పమంటుంటా.

నాన్న హెచ్చరించారు

ఒకసారి కడపజిల్లా అనంతరాజుపేట దగ్గర 'శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' షూటింగ్‌ జరుగుతోంది. చుట్టూ జనం నా(సిద్ధయ్య పాత్ర) మీద షాట్‌ తీస్తున్నారు. నేను కంగారులో రెండు మూడు టేక్‌లు తీసుకుంటున్నా. అప్పుడు నాన్న కొడతా అని హెచ్చరించారు. మరోవైపు అభిమానులను సముదాయించి నాచేత ఆ సీన్‌ చేయించారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లే నేను ఇన్ని సినిమాలు తీయగలిగాను. నన్ను నమ్మిన నిర్మాతలు, దర్శకుల వల్ల నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్నా.

వసుంధర భార్యగా లభించడం వరం

కార్యేశు దాసి.. కరణేశు మంత్రి... పద్యంలా... వసుంధర భార్యగా లభించడం నాకు వరం. నా విజయాలన్నింటిలో ఆమె పాత్ర ఉంది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నా కోపాన్ని, కష్టాన్ని తను తీసుకుంటుంది. నన్ను ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడానికి నిత్యం శ్రమిస్తుంది.

balakrishna family
బాలయ్య కుటుంబం

'దిస్‌ ఈజ్‌ బాలాస్‌ విక్టరీ' అన్నారు

1983 ఎన్నికల సమయంలో నేను కాకినాడలో అత్తగారింటికి వెళ్లా. కొత్త అల్లుణ్ని. అప్పుడు అక్కడ ప్రచారం చేయాల్సి వచ్చింది. ముప్పైవేల మందికి పైగా జనం... మొదటి సభ కదా! కాస్త ఆందోళన. ఇంటి దగ్గర కొన్ని పాయింట్లు రాసుకొని వెళ్లి మాట్లాడా. తర్వాత చాలాచోట్లకు ప్రచారానికి వెళ్లాల్సి వచ్చింది. ఫలితం వచ్చాక... కాకినాడ స్థానానికి అత్యధిక మెజార్టీ వచ్చింది. అప్పుడు నాన్న ‘దిస్‌ ఈజ్‌ బాలాస్‌ విక్టరీ’ అన్నారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి? 2019 ఎన్నికల్లో హిందూపురంలో మొదటిసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచా. అక్కడ నేను చేసిన సేవలకు ప్రజలు నా వైపు నిలిచారు. హిందూపురం పట్టణానికి మంచి నీటి సమస్య లేకుండా చేశా. మంచి ఆసుపత్రి కట్టించాం. తల్లీబిడ్డల కోసం ప్రత్యేక విభాగం అక్కడ సేవలందిస్తోంది.

బ్రహ్మణీని ట్యూషన్‌కు తీసుకెళ్లేవాణ్ని

నేను కొంతవరకూ పిల్లలకు సమయం ఇచ్చా. బ్రహ్మణీని ట్యూషన్‌కు తీసుకెళ్లేవాణ్ని. వాళ్లు చదువుకోవడానికి అవసరమైనవి ఇచ్చేవాణ్ని. సైన్స్‌, టెక్నాలజీకి సంబంధించి నాకు తెలిసిన విషయాలను వారితో పంచుకునేవాణ్ని. బ్రహ్మణీకి అయిదు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో సీటు వచ్చింది. నేను హార్వార్డ్‌కు వెళ్లు అనిచెప్పా. అక్కడికి ఇంటర్వ్యూకు వెళ్లాక వాళ్లు... 'ఇక్కడ సీటు లభించడం నీ అదృష్టం' అని ఏదో అన్నారంట. తను ఆ సీటు తిరస్కరించి వచ్చేసింది. స్టాన్‌ఫోర్డ్‌లో చదివింది. సింగపూర్‌లో ఉద్యోగం చేసింది. ఏ విషయమైనా తను లాజిక్‌గా చెబుతుంది. అందుకే నేను తన మాట వింటా. ప్రస్తుతానికి తనకు రాజకీయాలపై ఆసక్తి లేదు.

brahmini
బ్రాహ్మణి

సేవలు విస్తృతం

బసవతారకం ఆసుపత్రి ద్వారా మరింత మందికి సేవలందించాలనేది నా లక్ష్యం. దాదాపు రూ.650 కోట్లతో... తుళ్లూరులో 1000 పడకలతో క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మించదలిచాం. దాని ద్వారా ఎంతోమందికి చికిత్సలు అందుతాయి. నియోజకవర్గంలో చాలామందికి నా ఫోన్‌నంబర్‌ తెలుసు. ఏ సమస్య ఉన్నా కాల్‌ చేస్తారు. అక్కడున్న నా పీఏ ద్వారా ఆ పని పూర్తిచేయించే ఏర్పాట్లు చేస్తా.

ఇది చూడండి : అలసట తెలియని యోధుడు.. ఈ నందమూరి అందగాడు

Last Updated : Jun 10, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.