ETV Bharat / sitara

బాలయ్య 'అఖండ' 50 డేస్​.. విజయానికి కారణాలివే!

Akhanda success reasons: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై రేపటితో(జనవరి 20) 50 రోజులు పూర్తిచేసుకోనుంది. దీంతో పలుచోట్ల ఫ్యాన్స్​ భారీగా సంబరాలు చేసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రం విజయమవ్వడానికి గల కారణాల గురించి ఓ సారి తెలుసుకుందాం..

Balakrishna Akhanda success reasons
అఖండ సక్సెస్​
author img

By

Published : Jan 19, 2022, 5:40 PM IST

Updated : Jan 19, 2022, 6:13 PM IST

Akhanda 50th day: హీరో బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి కాంబోలో విడుదలైన సినిమా 'అఖండ' విజయాన్ని అందుకుని కరోనా కోరల్లో చిక్కుకున్న చిత్రసీమకు మళ్లీ ఊపరిపోసింది. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్లు కొలగొడ్డుతూ రికార్డులు సృష్టించింది. బాలయ్య కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. బాలయ్య నటనకు, యాక్షన్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అక్కడి ప్రేక్షకులు కూడా అఖండకు బ్రహ్మరథం పట్టారు. మాస్ ఆడియెన్స్​ను విపరీతంగా అలరించిన ఈ మూవీ.. రేపటితే(జనవరి 20) అత్యంత విజయవంతంగా 50వ రోజులోకి అడుగుపెట్టనుంది. దీంతో పలుచోట్ల ఫ్యాన్స్​ భారీగా సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు. ఈ సందర్భంగా సినిమా విజయానికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలయ్య విశ్వరూపం

సాధారణంగా స్టార్ హీరోలు ప్రయోగాలు చేయడం చాలా తక్కువనే చెప్పాలి. కానీ బాలకృష్ణ ఓ అడుగు ముందుకేసి అలాంటి సాహసమే చెశారు. అఘోర గెటప్​లో తన విశ్వరూపాన్ని చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

డైలాగ్​, యాక్షన్​ సీన్స్​

ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన ఒక్కో డైలాగ్​లు, ఆయన చేసిన యాక్షన్​ ఫైట్లు ప్రేక్షకుల ఒంట్లో పూనకాలు తెప్పించాయి.

తమన్​​ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​

ఒకవేళ అఖండకు తమన్​ కాకుండా ఇంకెవరైనా సంగీతం అందించి ఉంటే ఈ స్థాయిలో ఉండేది కాదేమో. ఆయన అందించిన మ్యూజిక్ చిత్రానికే హైలెట్​గా నిలిచింది. ఆయన మ్యూజిక్​​ వల్ల థియేటర్లలో సౌండ్​ బాక్స్​లు సైతం వణికిపోయాయి. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుకున్నాయి.

వేరే సినిమాలు లేకపోవడం

కరోనా పరిస్థితులు, టికెట్ల రేట్లు సమస్యల వల్ల చాలా సినిమాలు వాయిదా వేసుకున్నాయి. దీంతో ఆ సమయంలో స్టార్​ హీరోల చిత్రాలు సహా ఇతర చిన్న మూవీస్​ రిలీజ్​ కాకపోవడం అఖండకు కలిసివచ్చింది.

ఇతర అంశాలు

  • విలన్​గా శ్రీకాంత్ నటన
  • మరో అఘోర పాత్రలో జగపతిబాబు
  • కీలక పాత్రలో పూర్ణ యాక్టింగ్​
  • హీరోయిన్​గా ప్రగ్యాజైస్వాల్​ ఆకర్షణ
  • ఈ చిత్రంలోని పాటలు

ఇలా చాలా అంశాలు చిత్ర విజయానికి ప్రాణం పోశాయి.

ఇదీ చూడండి: Akhanda movie: బాలయ్య 'అఖండ' అరుదైన ఘనత

Last Updated : Jan 19, 2022, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.