Akhanda Sequel: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదలైన సినిమా 'అఖండ'. ఈ చిత్రం విడుదలైన తొలి షో నుంచే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, గెటప్, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆద్యంతం ఈ చిత్రంలో చూపించిన కొన్ని సన్నివేశాలు, మూవీ ముగించిన విధానం, అఘోర క్యారెక్టర్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడం వంటివి చూస్తే సీక్వెల్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ మూవీ క్లైమాక్స్‌లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో కీలక పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. 'నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను' అని చెప్తాడు. దీంతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తే.. ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం.. అఖండ పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు సినీవర్గాల్లో ఇదే అంశపై జోరుగా చర్చ నడుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ అంశాలు ఉండొచ్చు
ఒకవేళ సీక్వెల్‌ను తెరకెక్కిస్తే బాలకృష్ణ(అఘోర) నేపథ్యాన్ని చూపించొచ్చు. సినిమా ప్రారంభంలో పసిగుడ్డుగా ఉండగానే కాశీకి చేరతాడు బాలకృష్ణ. మరి అక్కడ ఎవరి దగ్గర, ఎలా పెరిగాడు? వంటి అంశాలను సీక్వెల్లో చూపించొచ్చు. ఇక ఈ మూవీలో బాలకృష్ణ(అఘోర) ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య చెడ్డ అఘోరాలను వెంటాడి మరీ చంపినట్లు చూపించారు. ఇందులో బాలయ్య(అఘోర) కర్తవ్యం పాడు బడిన గుడులను బాగుచేయడం. ఆ ఆలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడం. మరి ఈ క్రమంలో అతడికి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అందుకే చెడ్డ అఘోరాలను చంపాడా? ఇవి కూడా సీక్వెల్లో చూపించొచ్చు.
ఇదీ చూడండి: 'ఆ నమ్మకంతోనే అఖండ సినిమా తీశా'