ETV Bharat / sitara

బాలయ్య-బోయపాటి సినిమా తొలిషెడ్యూల్​ పూర్తి - ఎన్​బీకే106

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ తొలి షెడ్యూల్​ పూర్తిచేసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Bakrishna-Boyapati movie first schedule completed at varanasi
బాలయ్య-బోయపాటి సినిమా తొలిషెడ్యూల్​ పూర్తి
author img

By

Published : Mar 12, 2020, 8:47 PM IST

'సింహా', 'లెజెండ్‌' చిత్రాలతో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ చిత్రం.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. తాజాగా తొలిషెడ్యూల్ పూర్తిచేసుకుంది. వారణాశిలో జరిగిన ఈ షూటింగ్​ కోసం బాలయ్య దాదాపు 25 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ పాత్రలో రెండు కోణాలుంటాయట. కొన్ని సన్నివేశాల్లో ఈ స్టార్​హీరో.. అఘోరాగానూ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

Bakrishna-Boyapati movie first schedule completed at varanasi
నటి అంజలీ

బోయపాటి సినిమా తర్వాత సీనియర్‌ దర్శకుడు బి.గోపాల్‌ డైరెక్షన్​లో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌', 'సమర సింహారెడ్డి', 'నరసింహ నాయుడు' లాంటి విజయవంతమైన చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చాయి. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 106వ చిత్రం పూర్తికాగానే, విరామం తీసుకోకుండా కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్నాడట బాలయ్య. మేలో చిత్రీకరణ ఆరంభిస్తాడని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.