ETV Bharat / sitara

అక్షయ్ చివరి షెడ్యూల్​లో.. సైకో కిల్లర్​గా సుహాస్​ - మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆడవాళ్లు మీకు జోహార్లు, బచ్చన్​పాండే, ఫ్యామిలీ డ్రామా, డియర్ మేఘ, ఇష్క్ చిత్రాల సంగతులతో పాటు లాక్​డ్​ వెబ్ సిరీస్​ గురించి కూడా ఉంది.

Bachchan Pandey, Family Drama, ISHQ updates
మూవీ న్యూస్
author img

By

Published : Jul 22, 2021, 11:20 AM IST

*దేవిశ్రీప్రసాద్.. మరో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్​గా ఎంపికయ్యారు. శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఇప్పుడీ చిత్రానికే డీఎస్పీ సంగీతమందించనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.

DEVI SRI PRASAD
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్

*బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. 'బచ్చన్​పాండే'(BachchanPandey) చివరి షెడ్యూల్​ మొదలుపెట్టేశారు. 200 మంది ఆర్టిస్టులతో ఓ సినిమా హాల్​లో షూటింగ్ జరుగుతోంది. కృతిసనన్(krithi sanon), జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్​స్టర్ డ్రామా కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు.

Bachchan Pandey
బచ్చన్​పాండే సినిమాలో అక్షయ్, కృతిసనన్

*సుహాస్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఫ్యామిలీ డ్రామా'(Family Drama). ట్రైలర్​ను గురువారం రిలీజ్ చేశారు. మర్డర్​ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైకో కిల్లర్​గా కనిపించనున్న సుహాస్​కు, ఓ కుటుంబానికి మధ్య జరిగే సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు. మెహర్ తేజ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్ 'డియర్ మేఘ'(Dear Megha) ట్రైలర్​ వచ్చేసింది. ఇది చూస్తుంటే కన్నడ లవ్​స్టోరీ 'దియా'(Diya) గుర్తొస్తోంది. అయితే రీమేక్​ అనే విషయాన్ని చిత్రబృందం ఇప్పటివరకు వెల్లడించలేదు. అరుణ్ దాస్యం దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.

*తేజ సజ్జా 'ఇష్క్' సినిమాలోని 'చీకటి చిరుజ్వాలై' అంటూ సాగే లిరికల్​ గీతం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. మలయాళ లవ్​ థ్రిల్లర్ 'ఇష్క్'(ISHQ)కు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. హీరోయిన్​గా ప్రియా ప్రకాశ్ వారియర్​​ నటించింది. ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించారు.

*సత్యదేవ్​ 'లాక్​డ్​'(LOCKED) వెబ్ సిరీస్​ రెండో సీజన్​కు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుగుతోందని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని సత్యదేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆహా ఓటీటీలో తొలి సీజన్​ ఇప్పటికే అందుబాటులో ఉంది.

LOCKED WEB SERIES SEASON 2
సత్యదేవ్​ లాక్​డ్​ వెబ్ సిరీస్ సీజన్ 2

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.