అనుభవ్ సిన్హా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం.
'మన దేశంలో ఒకరి పట్ల లింగ వివక్ష, జాతి వివక్ష, కుల, మత విభేదాలు చూపించకూడదు. ఈ విషయం నేను చెప్పడంలేదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 చెబుతోంది. ఇప్పటివరకు విభేదించాం. ఇకపై మార్పును తెద్దాం' అని ఆయుష్మాన్ చెబుతున్న డైలాగ్‌తో టీజర్ ముగిసింది. దేశంలో జరిగిన కొన్నిఆసక్తికర సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 28న ‘ఆర్టికల్ 15’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">