ETV Bharat / sitara

'ఇంకెప్పుడూ నన్ను సినిమాలు చేయొద్దన్నారు' - 101 జిల్లాల‌ అంద‌గాడు

'అష్టా-చమ్మా'తో వెండితెరకు పరిచయమైన​ నటుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas). ప్రస్తుతం హీరోగా, నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. అవసరాల హీరోగా నటించిన '101 జిల్లాల‌ అంద‌గాడు' ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' (Alitho saradaga) కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Avasarala Srinivas
అవసరాల శ్రీనివాస్
author img

By

Published : Sep 6, 2021, 1:04 PM IST

Updated : Sep 6, 2021, 1:39 PM IST

తెలుగు సినీ పరిశ్రమకు 'అష్టాచమ్మా'తో ఎంట్రీ ఇచ్చి నటుడిగా గుర్తింపు పొందారు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas)​. ప్రస్తుతం దర్శకుడిగా, రచయితగానూ రాణిస్తున్నారు. అయితే 'అష్టాచమ్మా' సినిమాలో ఛాన్స్​ దక్కించుకొని, షూటింగ్ పూర్తయి.. ట్రైలర్​ వచ్చేంత వరకు ఆ విషయాన్ని వాళ్ల అమ్మానాన్నకు చెప్పలేదట శ్రీనివాస్​. అది చూశాక.. 'చేస్తే చేశావ్​ గానీ ఇంకెప్పుడూ చేయకు అని మా నాన్న అన్నారు' అని తాజాగా వెల్లడించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho saradaga) కార్యక్రమానికి విచ్చేసి.. పలు ఆసక్తికర సంగతులను పంచుకున్నారు అవసరాల శ్రీనివాస్​.

అవసరాల హీరోగా నటించిన '101 జిల్లాల‌ అంద‌గాడు' సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే విగ్గుకు సంబంధించి ఈ సినిమాకు చెందిన ఓ వీడియో వైరల్​ అయ్యింది. ఈ మేరకు స్పందించిన అవసరాల.. ప్రమోషన్​ కోసమే ఇలా చేసినట్లు సమాధానం ఇచ్చారు. దీంతో పాటు మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ నేటి (సెప్టెంబర్ 6) రాత్రి ఈటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆ ముద్దుగుమ్మకు బన్నీ మూడో ఛాన్స్​!

Last Updated : Sep 6, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.