క్రికెటర్లు, హీరోయిన్లతో డేటింగ్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మూడు ముళ్ల బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఇదే బాటలో మరో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వెళ్తున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో అతడు డేటింగ్ ఉన్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. అతియా శెట్టి.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. గత మూడు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. ఇటీవలే ఓ డిన్నర్‌కు వెళ్లి వస్తూ వీరిద్దరూ కెమెరాకు చిక్కారు. ఈ ఫొటోల్లో ఆకాశ్ రంజన్ కపూర్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

క్రికెటర్ రాహుల్ ఇప్పటికే నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాశ్ రంజన్ కపూర్లతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అతియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు.

హీరోలు సూరజ్ పంచోలీ, అర్జున్ కపూర్లతో అతియా ప్రేమాయణం నడిపించినట్లు పుకార్లు వినిపించాయి. 2015లో సూరజ్ హీరోగా నటించిన 'హీరో' సినిమాతో కథానాయికగా పరిచయమైంది అతియా శెట్టి.
ఇవీ చూడండి.. అలాంటి కథతో వస్తున్న తొలి తెలుగు సినిమా