ETV Bharat / sitara

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న రాహుల్-అతియా! - అహాన్ తానియా ష్రాఫ్ పెళ్లి

Rahul-Athiya Marriage: టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు అతియా సోదరుడు అహాన్ కూడా ఈ ఏడాదే వివాహం చేసుకుంటాడని సమాచారం.

KL Rahul Athiya marriage, రాహుల్ అతియా పెళ్లి
KL Rahul
author img

By

Published : Jan 21, 2022, 5:53 PM IST

Rahul-Athiya Marriage: టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. సునీల్ కుమారుడు అహాన్ కూడా ఇదే ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో బీటౌన్‌లో ఇప్పుడు శెట్టి కుటుంబంలో వివాహ వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు.

సునీల్ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ అతియాశెట్టి. హీరోయిన్‌గా సరైన సక్సెస్‌ని అందుకోలేకపోయిన ఈ భామ.. భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉంది. సుమారు మూడేళ్ల నుంచి డేటింగ్‌లో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారట. దీంతో ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అతియా శెట్టి సోదరుడు అహాన్‌ శెట్టి కూడా 'తడప్‌'తో గతేడాది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అహాన్‌కు ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో అతడు కూడా పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. తన ప్రేయసి తానియా ష్రాఫ్‌తో పెళ్లికి పెద్దల అంగీకారం కూడా తీసుకున్నాడట. దీంతో అతియా-రాహుల్‌, అహాన్‌-తానియా పెళ్లిళ్లు ఈ ఏడాదిలో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఆస్కార్ రేసులో సూర్య 'జై భీమ్'తో పాటు మరో సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.