చారిత్రక చిత్రాల్లో రాజుల ఔన్నత్యం, గొప్పతనం తెలియజేసేలా ప్రత్యేకమైన పాటలు.. చాలా సినిమాల్లో కనువిందు చేశాయి. జక్కన్న తీసిన బాహుబలి, సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ సినిమాలో ఇలాంటి పాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉండి అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పానిపట్'. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవరికర్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో స్టార్ హీరోలు అర్జున్ కపూర్, సంజయ్ దత్ కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని 'మర్ద్ మరాఠా' పాటను 1300 మంది డ్యాన్సర్లతో 13 రోజుల పాటు చిత్రీకరించారు. ప్రముఖ నృత్యకారుడు రాజుఖాన్ దీనికి కొరియోగ్రఫీ చేశాడు. ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతమందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1761లో జరిగిన మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. మరాఠా యోధుడు సదాశివ్‌రావ్ భావ్ పాత్రలో అర్జున్ కపూర్, అఫ్గానిస్థాన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలీగా సంజయ్ దత్ నటించారు. సదాశివ్‌రావ్ భావ్ భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. డిసెంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.