Ashok Galla Hero movie: "హీరోగా నేను ఓ ఇమేజ్ ఛట్రంలో బందీ అవ్వాలనుకోవట్లేదు. అన్ని రకాల జానర్లు చేయాలనుకుంటున్నా" అన్నారు అశోక్ గల్లా. మహేష్‌బాబు మేనల్లుడైనా ఆయన.. 'హీరో' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాని గల్లా పద్మావతి నిర్మించారు. నిధి అగర్వాల్ నాయిక. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు హీరో అశోక్. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
"ఎన్నో ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తొలి చిత్రంతోనే సంక్రాంతి బరిలో నిలవడం మరింత సంతోషాన్నిస్తోంది. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడు తాతయ్య కృష్ణగారు నన్ను ఓ సినిమాలో పెట్టారు. తర్వాత మహేష్ మామయ్య 'నాని' చిత్రంలో నటించాను. అలా నాకు నటన పట్ల ఇష్టం పెరిగింది. ఆ ఆసక్తితోనే చిన్నప్పటి నుంచే నటనలో శిక్షణ తీసుకున్నా. థియేటర్ ఆర్ట్స్ చేశాను. సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తుంటే.. అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నాను. అయితే నా ఆలోచన ఇంట్లో వాళ్లకి చెప్పినప్పుడు కాస్త భయపడ్డారు. సినిమా వాళ్ల జీవితం ఎలా ఉంటుందో అమ్మకు తెలుసు. ఒకరోజు సక్సెస్ ఉంటే.. ఇంకోరోజు ఉండదు. 'ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి అవసరమా?' అని వారించే ప్రయత్నం చేసింది. నాన్న అలానే అన్నారు. నా నిర్ణయం గట్టిగా చెప్పడం వల్ల వారు ప్రోత్సహించారు. తర్వాత ఇక్కడకు వస్తే ఎలా ఉండాలి? ధైర్యంగా ప్రతిదీ ఎలా ఎదుర్కోవాలి? అన్నది మహేష్‌బాబు చెప్పారు".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హీరో అవ్వడమే లక్ష్యం..
"నేనిందులో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తా. హీరో అవ్వాలన్నది నా లక్ష్యం. కాస్త దూకుడుగా ఉండే పాత్రిది. కాలేజీలో ఉన్నప్పుడు మనమే తోపు అనుకునే కుర్రాళ్లు ఉంటారు కదా.. అలాంటి పాత్రే ఇది. ఈ కథ.. పాత్ర గురించి ఇంత కంటే ఎక్కువ ఇప్పుడే చెప్పలేను కానీ, ఇందులో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. రేపు ఈ చిత్రం విడుదలయ్యాక.. ఈ సినిమాకు 'హీరో' అన్న టైటిల్ సరైన ఎంపిక అంటారంతా. దీన్ని ఇలాగే తీస్తున్నామని దర్శకుడు శ్రీరామ్ నాకు ముందే చెప్పారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి".
ఎప్పుడూ భయపడలేదు..
"ప్రత్యేకంగా నేనే శ్రీరామ్ ఆదిత్యని దర్శకుడిగా ఎంచుకోలేదు. మేమిద్దరం ఒకరినొకరు ఎంచుకున్నాం. నాకు ఆయనేంటో తెలుసు. ఆయన సినిమాల్ని తెరకెక్కించే విధానం చాలా బాగుంటుంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం. తర్వాత ఓ స్టోరీ వచ్చింది. దానికి మేము కనెక్ట్ అయ్యాం. ఈ సినిమా విషయంలో నిధి అగర్వాల్ నాకెంతో స్వేచ్ఛ ఇచ్చింది. అందుకే మా ఇద్దరి సీన్స్, పాటలు చాలా బాగా వచ్చాయి. హార్స్ రైడింగ్ నేర్చుకుని కౌబోయ్ ఎపిసోడ్ చేశా".
ఇదీ చూడండి: ఇంత అందమైన ఎంపీని ఎప్పుడు చూసుండరూ!