తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కంగనా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా అరవిందస్వామి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఎంజీఆర్ గెటప్‌లో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు అరవింద్ స్వామి. జయలలిత జీవితంలో కీలకపాత్రను పోషించిన వ్యక్తుల్లో ఎంజీఆర్ ఒకరు. అందువల్ల ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రను కోలీవుడ్ నటుడు అరవిందస్వామి పోషించాడు. శుక్రవారం ఎంజీఆర్ జయంతిని పురస్కరించుకుని 'తలైవి' చిత్రబృందం అరవింద్ స్వామి లుక్‌ను విడుదల చేసింది.
ఇందులో అరవిందస్వామి క్లీన్ షేవ్‌తో కనిపించి.. ఎంజీఆర్‌గా సినీ ప్రియులను అలరించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషికమా?