'ఖాకీ' 'ఖైదీ' లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు తమిళ హీరో కార్తీ. దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా రాణిస్తోన్న నటుడు అరుణరాజా కామరాజ్. తాజాగా వీరిద్దరి నుంచి ఓ సినిమా రానుందని తెలుస్తోంది. ఇప్పటికే కార్తీ గతంలో తను నటించిన 'దేవ్' చిత్ర నిర్మాణ సంస్థకు మాట కూడా ఇచ్చాడట. అయితే అధికారికంగా త్వరలోనే ఈ వార్తను ధృవీకరించనున్నారని సినీ వర్గాల సమాచారం .
అరుణ్ ఇప్పటికే 'రాజా రాణి'లో నటించి అలరించాడు. అంతకు ముందు ఐశ్వర్యా రాజేష్ నటించిన 'కణ' చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇక కార్తీ.. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నాడు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం వస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వరకు వేచిచూడాల్సిందే.
ఇదీ చూడండి.. భీష్మ ట్రైలర్: అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం