'టెర్మినేటర్' లాంటి యాక్షన్ సినిమా సిరీస్‌తో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్(Arnold Schwarzenegger), ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2003 నుంచి 2011 వరకు అమెరికాలోని కాలిఫోర్నియాకు ఆయన గవర్నర్‌గానూ పనిచేశారు. అయితే తాను గవర్నర్‌గా పనిచేయడం తన పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. ఫాదర్స్ డే సందర్భంగా ఇన్‌స్టాలో తన పెద్ద కుమార్తె క్యాథరీన్(Katherine Schwarzenegger) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఆ పదవిలో ఉన్నంత కాలం తన పిల్లలు అసహ్యించుకున్నారని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా పిల్లలు ఎంతగా అసహ్యించుకున్నారో ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. నేను కాలిఫోర్నియా గవర్నర్ అయిన తర్వాత నా పిల్లలు నన్ను చూసి గర్వపడతారనుకున్నా. కానీ, అందుకు భిన్నంగా వారు స్పందించారు. బహుశా షూటింగ్ సెట్స్‌కు అలవాటు పడిన వాళ్లు నన్ను ఇలా చూడలేకపోయారు. గవర్నర్ పదవిని అసహ్యించుకుంటున్నట్లు నాతో చెప్పారు. నటన నుంచి రాజకీయాల్లోకి ఎందుకొచ్చావని అడిగేవారు. ఎందుకంటే గవర్నర్‌గా ఉన్నప్పుడు ఉరుకుల పరుగులతో వాళ్లతో గడిపే సమయం లేకుండా పోయేది. కానీ, ఆ సమయంలో నా భార్య వాళ్లకు మద్దతుగా నిలిచింది"
- ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, హాలీవుడ్ హీరో
ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్.. 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేశారు. మారియా షివర్(Maria Shriver) అనే మహిళా జర్నలిస్టును 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి కేథరిన్, పాట్రిక్, క్రిస్టోఫర్, క్రిస్టినా సంతానం. 2017లో వీరిద్దరూ వివాహబంధానికి స్వస్తి పలికారు.
ఇదీ చూడండి.. గాడిద పిల్ల, గుర్రం పిల్లతో టెర్మినేటర్ హీరో