ETV Bharat / sitara

మలైకా అరోరాతో బ్రేకప్​.. అర్జున్​కపూర్​ క్లారిటీ - అర్జున్​కపూర్​ మలైకా అరోరా రిలేషన్​షిప్​

Arjunkapoor Malaika arora break up: తాను మలైకా అరోరా విడిపోయారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు బాలీవుడ్ హీరో అర్జున్​ కపూర్​. అవన్నీ అవాస్తమని ​కొట్టిపారేశారు.

Arjunkapoor Malaika arora break up
అర్జున్​కపూర్​-మలైకా అరోరా
author img

By

Published : Jan 12, 2022, 6:22 PM IST

Updated : Jan 12, 2022, 7:00 PM IST

Arjunkapoor Malaika arora break up: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అర్జున్‌ కపూర్‌-మలైకా అరోరా విడిపోయారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన అర్జున్​ అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. తామిద్దరూ బాగానే ఉన్నట్లు సోషల్​మీడియా ద్వారా తెలిపారు. వారిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్​ చేసి.. "పనికిమాలిన రూమర్స్​కు చోటు లేదు. జాగ్రత్తగా ఉండండి. లవ్​ యు ఆల్​" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.

అంతకుముందు అర్జున్​-మలైకా విడిపోయారంటూ, దీంతో మలైకా తీవ్ర మనస్తాపంలోకి వెళ్లిపోయి ఇంట్లో నుంచి కూడా బయటకు రావట్లేదని ఓ బీటౌన్​ ప్రతినిధి తెలిపారు. "దాదాపు ఆరు రోజుల నుంచి మలైకా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. పూర్తిగా ఐసోలేషన్​లోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె చాలా బాధ పడుతోంది. కొంతకాలం ప్రపంచానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. అర్జున్​ కపూర్​ ఈ ఆరు రోజుల్లో ఒక్కసారి కూడా ఆమెను కలవలేదు. మూడు రోజుల క్రితం అర్జున్​.. మలైకా ఇంటి దగ్గరే ఉన్న రియా కపూర్​ ఇంటికి డిన్నర్​కు కూడా వెళ్లాడు. కానీ మలైకాను కలవలేదు. నిజానికి వీరిద్దరూ ఎప్పుడూ కలిసి రియా ఇంటికి డిన్నర్​కు వెళ్తారు. కానీ ఈ సారి మలైకా దూరంగా ఉంది." అని సదరు ప్రతినిధి చెప్పారు.

ఇటీవలే అర్జున్​-మలైకా మాల్దీవుల పర్యటనకు కూడా వెళ్లి సరదాగా ఎంజాయ్​ చేసి వచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు.

Arjunkapoor Malaika arora break up
అర్జున్​కపూర్​-మలైకా అరోరా

ఇదీ చూడండి: 'ఆంటీతో డేటింగ్​' అంటూ ట్రోల్స్​.. అర్జున్​కపూర్​ స్ట్రాంగ్​ కౌంటర్​

Last Updated : Jan 12, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.