బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సీనియర్ నటి మలైకా అరోరా ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. వీరికి నిశ్చితార్థం కూడా అయినట్లు పుకార్లు వచ్చాయి. తాజగా తన ప్రేయసి మలైకా గురించి స్పందించాడు అర్జున్. మలైకా స్వతంత్రంగా ఉంటూ గౌరవప్రదంగా బతకడం తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మలైకాలో ఏమంటే ఇష్టమని అడగగా స్పందించాడీ హీరో.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"మలైకాకు ఉన్న గౌరవం నాకిష్టం. 20 ఏళ్ల వయసు నుంచి ఇప్పటివరకు స్వతంత్రంగా జీవిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుంది. తన పనే సమాధానం చెప్పాలని భావిస్తుంది. ప్రతిరోజూ తన నుంచి ఎంతో నేర్చుకుంటూనే ఉంటా."
-అర్జున్ కపూర్, నటుడు
ప్రస్తుతం అర్జున్ కపూర్.. 'సర్దార్ కా గ్రాండ్సన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. మే 18న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రొమాంటిక్ థ్రిల్లర్ 'ఏక్ విలన్ రిటర్న్'లోనూ హీరోగా నటించనున్నాడు.